మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా నటులతో పాటు ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుతీరతాయి. అలాగే మన టాలీవుడ్ నుండి ఆ అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్కిన సంగతి కూడా తెలిసిందే. మహేష్ కు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసి.. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మహేష్ అభిమానుల కోసం ఈ మైనపు విగ్రహాన్ని ముందుగా హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో ఉంచి ఆ తర్వాత దానిని సింగపూర్ మ్యూజియంలో ఉంచాలని నిర్ణయించారు. ఇక అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న ఆ సమయం కూడా వచ్చేసింది. మార్చి 25వ తేదీన ఉదయం 10 గంటలకు మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారట. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ మైనపు బొమ్మతో సెల్ఫీ తీసుకునే అవకాశం కూడా ఫ్యాన్స్ కు కల్పించనున్నారట. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.
ఇక ఈకార్యక్రమం ముగిసిన తరువాత మైనపు బొమ్మను సింగపూర్ తరలించనున్నారు. అయితే గ్రేట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకూ ఎంతో మంది మైనపు బొమ్మలు మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టగా.. ఇలా చేయడం మాత్రం ఇదే మొదటి సారి. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ బి రెడీ.
[youtube_video videoid=hnyNenuG-BM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: