ప్రస్తుతం ఎన్నికల తరుణం. ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్నా.. మరోవైపు వెండితెరపై సినిమాల హవా సాగుతూనే ఉంది. ఇక ఈ శుక్రవారం అయితే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా.. మార్చి 29న మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా ముగ్గురు ముఖ్యమంత్రుల జీవితాలతో ముడిపడ్డ చిత్రాలు కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మార్చి 29న మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే రోజున ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కిన “ఉద్యమ సింహం” కూడా విడుదల కానుంది. ఈ సినిమాకి అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించారు. అలాగే.. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా పి. చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన “జగన్నాయకుడు” కూడా అదే మార్చి 29 న రిలీజ్ కానుంది.
ఇలా… ఒకే రోజున ముగ్గురు ముఖ్యమంత్రుల జీవితాలతో ముడిపడ్డ మూడు ఆసక్తికరమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి.. వీటిలో ఏ చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కుతుందో చూడాలి.
[youtube_video videoid=xtnmRZ9_bzg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: