వరుస హిట్లు కొట్టి సంచలనం సృష్టించిన విజయ దేవరకొండ ఇప్పుడు తన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నాడు. గత ఏడాది గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే అప్పుడు అర్జున్ రెడ్డి వల్ల అంత బిజినెస్ అయిందిలే అని ఆ క్రెడిట్ అర్జున్ రెడ్డి ఖాతాలో వేసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అర్జున్ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో హిట్లు కొట్టి తన సత్తా మరోసారి చూపించాడు విజయ్. గీత గోవిందం ఏకంగా 70 కోట్లకు పైగా వసూలు చేయగా.. టాక్సీవాలా కూడా 24 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా బిజినెస్ మాములుగా జరగట్లేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 40 కోట్లు జరుగుతుందని తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో ఈ సినిమాను 30 కోట్ల వరకు అమ్మేస్తున్నారట. నైజాంలో ఏకంగా 7.5 కోట్లకు.. సీడెడ్ 3.5 కోట్లు.. ఆంధ్రా ఏరియాలో 10 కోట్లకు సినిమాను అమ్మేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా సినిమా భారీగానే అమ్ముడైనట్టు తెలుస్తోంది.
కాగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. మరి గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టిన ఈ జంట ఈసినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో ?లేదో? తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=n3AqEHg6ofI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: