మెగాస్టార్ చిరంజీవి అంటేనే పలు రికార్డులకు కేంద్ర బిందువు. ఆయన నటించిన అనేక చిత్రాలు రికార్డు స్థాయి విజయాలను అందుకోవడమే కాకుండా… కొత్త రికార్డులను నెలకొల్పాయి. అలా… నైజాంలో రూ.కోటి వసూళ్ళు చేసిన తొలి తెలుగు చిత్రంగా `స్టేట్ రౌడీ` అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డితో పాటు పి.శశిభూషణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. చిరంజీవికి జోడీగా రాధ, భానుప్రియ నటించిన ఈ చిత్రంలో శారద, రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటించారు. బప్పీలహరి స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా `రాధ రాధ`, `వన్ టూ త్రీ`, `చుక్కల పల్లకిలో`, `తథిగణతోం` పాటలు అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. 1989 మార్చి 23న విడుదలైన `స్టేట్ రౌడీ`… నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`స్టేట్ రౌడీ` – కొన్ని విశేషాలు
* చిరంజీవి, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. ఆ తరువాత వీరి కలయికలో `మెకానిక్ అల్లుడు`, `ఇంద్ర` వచ్చాయి. వీటిలో `ఇంద్ర` ఇండస్ట్రీ హిట్‌గా నిలచింది.
* చిరంజీవి, బప్పీలహరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఇది. ఆ తరువాత ఇద్దరి కలయికలో వచ్చిన `గ్యాంగ్ లీడర్`, `రౌడీ అల్లుడు` కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించి… ఈ కాంబోలో హ్యాట్రిక్‌ని నమోదు చేశాయి. అయితే… వీరి చివరి కాంబినేషన్ మూవీ `బిగ్ బాస్` మ్యూజికల్‌గా మెప్పించినా… బాక్సాఫీస్‌ని శాసించలేకపోయింది.
[youtube_video videoid=_phcQ0DrIVM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: