మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ

Mahesh Babu Wax Figure Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Wax Statue Inaugurated in AMB Cinemas,Super Star Mahesh Babu Wax Statue Latest News,Mahesh Babu Wax Statue Reveals at ABM Cinemas,Mahesh Babu Wax Statue Event Updates,Super Star Mahesh Babu Wax Statue
Mahesh Babu Wax Figure Unveiled

ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సిమానాస్ లో మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు మహేష్ బాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబసభ్యులతో పాటు.. మహేష్ బాబు అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అభిమానులకు కూడా మైనపు ప్రతిమతో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు  మైనపు ప్రతిమను తరలిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. మే 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=MfCxdchXOB8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.