ఒకే వారంలో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది. అయితే… అలాంటి రేర్ ఫీట్ ఈ వారం టాలీవుడ్‌లో చోటుచేసుకోనుంది. కేవలం ఒక రోజు గ్యాప్‌లో అలా రెండు ఆసక్తికరమైన కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే… `ఐరా`, `సూర్యకాంతం`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ సూపర్ స్టార్ నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం ప్రదర్శించిన `ఐరా` హారర్ టచ్‌తో రూపొందగా… మెగా డాటర్ కొణిదెల నిహారిక టైటిల్ రోల్‌లో సందడి చేస్తున్న `సూర్యకాంతం` వినోదాత్మక చిత్రంగా తెరకెక్కింది. తమిళంలో రూపొందిన `ఐరా` తెలుగులో అనువాద రూపంలో మార్చి 28న విడుదల కానుండగా… అచ్చతెలుగు చిత్రం `సూర్యకాంతం` మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అలరించిన ఈ రెండు విమెన్ సెంట్రిక్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు పెర్‌ఫార్మ్ చేస్తాయో చూడాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.
[youtube_video videoid=WiBfR5Hg-EE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: