రెండు విభిన్న పాత్ర‌ల్లో ప్ర‌భాస్‌?

2019 Latest Telugu Movie News, Actor Prabhas New Movie News, Prabhas in 2 Different Roles?, Prabhas Next Film News, Prabhas To Act in 2 Different Roles, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Young Rebel Star Prabhas To Play 2 Different Roles in His Next
Prabhas in 2 Different Roles?

`మిర్చి`, `బాహుబ‌లి – ది బిగినింగ్‌`, `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌… ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగ‌స్టు 15న విడుద‌ల కానుంది. ఇక `జిల్‌` రాధాకృష్ణ రూపొందిస్తున్న పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ వ‌చ్చే ఏడాది ఆరంభంలో తెర‌పైకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `జిల్‌` రాధాకృష్ణ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఇందులో ప్ర‌భాస్ రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వనున్నాడ‌ట‌. ఒక పాత్ర సిన్సియ‌ర్ ల‌వర్ కాగా… మ‌రొక‌టి ప్లే బాయ్ త‌ర‌హా పాత్ర అని టాలీవుడ్ టాక్‌. మొద‌టి పాత్రకి సంబంధించిన స‌న్నివేశాల‌న్నీ వింటేజ్ యూర‌ప్ నేప‌థ్యంలో సాగుతాయ‌ని, ఆ పాత్ర‌కి జోడీగా పూజా హెగ్డే క‌నిపిస్తుంద‌ని… ఇక రెండో పాత్రకి సంబంధించిన స‌న్నివేశాల‌న్నీ ఇండియా నేప‌థ్యంలో ఉంటాయ‌ని, ఈ క్యారెక్ట‌ర్ కి జోడీగా కాజ‌ల్ నటిస్తోంద‌ని స‌మాచారం. మ‌రి… ఈ వార్తల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

[subscribe]

[youtube_video videoid=hKDnz0e6338]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 16 =