వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. అలా… నాగ్ నటించిన ప్రయోగాత్మక పాత్రల్లో… `ఊపిరి` చిత్రంలోని విక్రమాదిత్య పాత్ర ఒకటి. వీల్ ఛైర్‌కే పరిమితమైన ఈ పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోవడమే కాదు… ఆ పాత్రకు తగ్గ హావభావాలు పలికించి అలరించాడు. అలాగే… కేర్ టేకర్‌గా అతని జీవితంలోకి వచ్చి తదనంతరం స్నేహితుడై పోయే శీను పాత్రలో కార్తి కూడా పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన `ఊపిరి`ని ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించగా… ఇతర ముఖ్య పాత్రల్లో తమన్నా, ప్రకాష్ రాజ్ నటించగా… అతిథి పాత్రల్లో శ్రియ, అనుష్క దర్శనమిచ్చారు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్… తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందింది. `తోళా` పేరుతో తమిళనాట విడుదలైన ఈ సినిమాకి రెండు చోట్లా మంచి ఆదరణ దక్కింది. 2016 మార్చి 25న విడుదలైన `ఊపిరి` నేటితో మూడు వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=e–j3I_KMr4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: