2000లో విడుదలైన `హేండ్సప్` చిత్రంతో తెలుగునాట నటుడిగా కెరీర్‌ని ఆరంభించిన సోనూ సూద్‌కి… టర్నింగ్ పాయింట్‌లా నిలచిన చిత్రం మాత్రం `అరుంధతి` (2009) అనే చెప్పాలి. అనుష్క టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో పశుపతి పాత్రలో సోనూ సూద్ అభినయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే… అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటికీ సోనూ సూద్ పేరు చెబితే `అరుంధతి`తో తను చెప్పిన `వదల బొమ్మాళి వదలా` అనే డైలాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… `అరుంధతి` తరువాత పలు చిత్రాల్లో విలన్‌గా అలరించిన సోనూ… ఆ స్థాయి పాత్రలోనైతే కనపించలేదనే చెప్పాలి. అయితే… ఆ లోటుని తీర్చే చిత్రంగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రాబోతోందని తెలుస్తోంది. ఆ చిత్రమే `సీత`. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా… పవర్‌ఫుల్ విలన్‌గా సోనూ సూద్ కనిపిస్తాడట. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న తెరపైకి రానుంది. సరిగ్గా పదేళ్ళ క్రితం `అరుంధతి` చేసిన మ్యాజిక్… ఇప్పుడు `సీత` కూడా రిపీట్ చేస్తే… సోనూసూద్ మళ్ళీ విలన్‌గా బిజీ అయిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం… ఏం జరుగుతుందో?
[youtube_video videoid=h63rGsjy0lU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: