ఈ వేసవిలో పలు ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా… ప్రతీ వారం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతూ… ప్రేక్షకులకు వేసవి వినోదాన్ని అందివ్వనుంది. అయితే… మే 31న మాత్రం రెండు వైవిధ్యభరితమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `డియర్ కామ్రేడ్`, `ఎన్జీకే`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`గీత గోవిందం` తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం `డియర్ కామ్రేడ్`. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా… ఈ సినిమాని మే 31న విడుదల చేయబోతున్నారు. ఇక అదే రోజున కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` కూడా తెరపైకి రానుంది. శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్యకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… `డియర్ కామ్రేడ్`, `ఎన్జీకే`… ఇటు తెలుగు, అటు తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ ఒకే రోజున తెరపైకి రాబోతున్నాయి. మరి… ఈ రసవత్తరమైన పోటీలో ఏ సినిమాకి మంచి మార్కులు దక్కుతాయో చూడాలి.
[youtube_video videoid=4BRnD6to5dY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: