టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ఈ నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో సమంతతో పాటు విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి .. పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కనిపించనుండగా… ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరి తెలుగులో సమంతకి .. రమ్యకృష్ణకి.. అలాగే విజయ్ సేతుపతికి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. దీంతో ఈ సినిమా వసూళ్లు భారీగా వుంటాయనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు. మరి వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
[youtube_video videoid=3-Xq_Zz3nPA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: