తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ క్వీన్ కంగన అమ్మ పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమాకు మణికర్ణికకు స్క్రిప్టు అందించిన విజయేంద్ర ప్రసాదే కథను అందించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తను ఏ పాత్ర చేసినా పర్ ఫెక్ట్ గా ఉండాలనుకునే కంగన ఈసినిమా కోసం కూడా అప్పుడే రిహార్సల్స్ మొదలుపెట్టేసిందట. అంతేకాదు.. ఈ సినిమా కోసం తమిళ్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేసిందట.
కాగా విబ్రి, కర్మ మీడియా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘తలైవి’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. మరి తెలుగులో ఈసినిమా టైటిల్ మారుస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ‘ఐరన్ లేడీ’ పేరుతో మరో బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. మరి ఈ బయోపిక్ లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూద్దాం…
[youtube_video videoid=bu-LlHHNl6U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: