పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే… గత కొద్దిరోజులుగా ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. నిన్న రాత్రితో అక్కడ షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు.. ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా… ఆ సందర్భంలో దిగిన ఒక సెల్ఫీని తన ట్విట్టర్లో షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గోవా తరువాత షెడ్యూల్ ను ‘వారణాసి’ (కాశీ)లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట చిత్రయూనిట్. ఇక త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకొని మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు.
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: