యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు ఆసక్తికరమైన చిత్రాలతో అభిమానులను పలకరించనున్నాడు. వాటిలో ఒకటి… సుధీర్ వర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా… మరొకటి `96` రీమేక్. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే తెరపైకి రాబోతున్నాయి. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా మే నెలలో విడుదల కానుండగా… `96` రీమేక్ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… సుధీర్ వర్మ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. రెండు టైమ్ లైన్స్‌లో నడిచే ఈ సినిమాలో ప్లే బాయ్ గా, ఏజ్డ్ గ్యాంగ్ స్టర్‌గా… ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ప్లే బాయ్ షేడ్స్ ఉన్నప్పుడు అతని పాత్రకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ కనిపిస్తుందని… ఇక గ్యాంగ్ స్టర్ షేడ్స్ ఉన్నప్పుడు కాజల్ అగర్వాల్ జోడీగా దర్శనమిస్తుందని టాలీవుడ్ టాక్. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
[youtube_video videoid=WIoi2GW6jE4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: