గుణశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ రానా ప్రధాన పాత్రలో ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే మరో చారిత్రాత్మక కథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలా సెట్లు ఈ సినిమా కోసం నిర్మాణమైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకు విఎఫ్ఎక్సే కీలకం అని తెలుసు. దానికోసం కోసం ఏకంగా 16 ఇంటర్నేషనల్ స్టూడియోస్ పనిచేస్తున్నాయట. ఈ 16 స్టూడియోలు విఎఫ్ఎక్స్ పనిలో ఉన్నాయట. బెటర్ అండ్ బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ ను అందించడానికి ఈ స్టూడియోలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ పౌరాణిక గాథను దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. రానా ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా.
ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీ,నటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు సమాచారం. అన్ని భారీతయ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మరి మొదటి నుండి రానా వైవిధ్యమైన పాత్రలు ఎన్నుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రతో అలరించడానికి వస్తున్నాడు. మరి ఈ అద్భుతాన్ని చూడాలంటే మాత్రం చాలా టైమే పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=20aZHly_zTY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: