“ఏదీ తనంత తానై నీ దరికి రాదు.. సాధించి శోధించాలి.. అదియే ధీర గుణం” అన్న శ్రీశ్రీ పాటలోని కార్యసాధనా స్ఫూర్తి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ లో నిండుగా కనిపిస్తుంది. ప్రజా బాహుళ్యంలో తనకు ఉన్న ఇమేజ్, గ్లామర్ లే తనను, తన జనసేన అభ్యర్థులను గెలిపిస్తాయి అనే ధీమాతో ఇంటి పట్టున కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలక్షేపం చేయటం లేదు ఈ జనసేన అధిపతి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనం మధ్య, జనం కొరకు, జనంతో మమేకమై తిరగాలి, తిరిగి ground level రియాలిటీస్ తెలుసుకోవాలి… అనే లక్ష్యంతో గత ఆరు నెలల నుండి అహర్నిశలు కష్టపడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచార ఉధృతి అతని విజయావకాశాలను చాలా చాలా మెరుగుపరిచింది.
జనసేనను స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ తన సినీ సుఖాలకు, సౌఖ్యాలకు వీడ్కోలు చెప్పి జన క్షేత్రంలోకి అడుగు పెట్టారు. అనూహ్యంగా ముంచుకు వచ్చిన, ముందుగా వచ్చిన ఎన్నికల సమరంలో అన్ని ప్రధాన పార్టీలతో పాటు అభ్యర్థులను ప్రకటించి, మిత్రపక్షాలను సంతృప్తిపరచి ఆత్మవిశ్వాసం ప్రపూరితంగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్.
పగలు- రాత్రి, ఎండా వాన అనే తేడా లేకుండా ప్రచార ఉద్ధృతిని పెంచిన పవన్ కళ్యాణ్ నిద్రాహారాలను, సుఖసౌఖ్యాలను లెక్కచేయకుండా తిరుగుతున్న దృశ్యాలు ప్రతిరోజు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం పైన ఫోటోలలో రోడ్డు పైనే తాటాకు చాప మీద కూర్చుని మట్టి చిప్పలో జొన్న కూడు తింటున్న దృశ్యం చూసి అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. వ్యక్తిగతంగా రాజభోగాలు అనుభవించగల స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇవి ఎందుకొచ్చిన తిప్పలు అని అభిమానులు వాపోతుంటే… “వెరీగుడ్ బాగా కష్ట పడుతున్నాడు” అని పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. మొదట్లో పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్ద అంతగా ఉండదు అనుకున్న మాట వాస్తవమే కానీ… ఎన్నికలు సమీపించిన తరుణంలో పవన్ కళ్యాణ్ ఊపు, ఉద్ధృతి బాగా పెరిగాయి. ఇంతకూ ఈ తాటాకు చాప, జొన్న కూడు, మిరపకాయ దృశ్యం ఎక్కడిది అనుకుంటున్నారా!? ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద కొద్దిసేపు ఆగి భోంచేసి, సేద తీరినప్పటిది ఈ దృశ్యం.1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథం మీద విస్తృత ప్రచారం చేస్తున్న రోజుల్లో “అన్న నందమూరి తారక రామారావు గారు ఇలాగే రోడ్డుమీద స్నానం చేసినప్పటి దృశ్యం గుర్తుకు వస్తుంది ఈ ఫోటోలు చూస్తే.
మరి తన ‘ఖుషీ’లను, ‘జల్సా’లను త్యజించి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ను విజయం ఏ మేరకు వరిస్తుందో వేచి చూద్దాం.
[youtube_video videoid=A0zDh5Sgb-0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: