నాగార్జున కెరీర్ లో మన్మథుడు సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచి..ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే ఈసినిమాను ఈరోజు లాంచ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మన్మథుడు 2 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ రైటర్ సత్యానంద్.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కి స్క్రిప్ట్‌ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సభ్యులు కూాడా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని నటిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక వారం రోజులు హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ జరుపుకున్నాక చిత్ర యూనిట్ పోర్చుగల్ వెళ్లనుంది. మరి మన్మథుడు సినిమా లాగ ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందో? లేదో? చూద్దాం..
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: