సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`… ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదల విషయంలో వాయిదాల పర్వం చోటుచేసుకున్నా… ఆసక్తికరంగా ఈ సినిమా మహానటుడు, మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు లక్కీ డేట్‌కే ల్యాండ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిన `లవకుశ` (1963) చిత్రం అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా మార్చి 29న విడుదలైంది. ఆ తరువాత అదే తేదికి వచ్చిన ఎన్టీఆర్ చిత్రాలు `తిక్క శంకరయ్య` (1968), `దేశోద్ధారకులు` (1973) కూడా విజయఢంకా మ్రోగించాయి. కట్ చేస్తే… అదే మార్చి 29న ఎన్టీఆర్ 1982లో `తెలుగు దేశం` పార్టీని స్థాపించి… తెలుగునాట సరికొత్త రాజకీయ చరిత్రకు నాంది పలికారు.
ఇలా… ఎన్టీఆర్ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమున్న అదే మార్చి 29న ఇప్పుడు `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల కానుండడం… ఎంతటి శుభసూచకమో అర్థం చేసుకోవచ్చు. వాయిదాల కారణంగా ఈ సినిమాపై కాస్త బజ్ తగ్గినా… ఎన్టీఆర్ లక్కీ డేట్‌కి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి… ఎన్టీఆర్ సెంటిమెంట్ డేట్ `లక్ష్మీస్ ఎన్టీఆర్`కి సెంటిమెంట్‌గా కలిసొస్తుందా? వేచిచూద్దాం…
[youtube_video videoid=xtnmRZ9_bzg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: