
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 66


మరోసారి క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్?

కొత్త సినిమా ప్రారంభానికి డేట్ ఫిక్స్

జెర్సీ 2 వీక్స్ కలెక్షన్స్

36 వ వసంతంలో అడుగు పెడుతున్న త్రిష

మహానటి కి మరో అరుదైన గౌరవం

సమ్మర్ బాక్స్ ఆఫీస్ హిట్స్

మణిరత్నం కొత్త చిత్రం వివరాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’

మహర్షి లోనూ సేమ్ సీన్ కానీ..!

యూరప్ లాంగ్ షెడ్యూల్ లో మహానటి

అప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ - ఇప్పుడు మహర్షి

వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్డే

రవితేజ కోసం డైరెక్టర్ల పోటీ
మాస్ రాజా రవితేజ, వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం బడ్జెట్ ఎక్కువ కావడమేనట. దీంతో షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు.

జూన్ నెలాఖరు నుంచి మహేష్, అనిల్ రావిపూడి చిత్రం
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా ప్రమోషన్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే తొలిసారిగా నటించిన ఈ సినిమాలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర పోషించాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోసారి క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్?
వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ఇక ఈ ఏడాది… మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని యన్.టి.ఆర్. కథానాయకుడు, యన్.టి.ఆర్. మహానాయకుడు పేర్లతో రెండు భాగాల బయోపిక్‌గా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో… క్రిష్ తదుపరి చిత్రం పై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం… తన అప్ కమింగ్ ఫిలింను హిందీలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట క్రిష్.

‘సైరా’లో స్వీటీ స్పెషల్ సాంగ్?
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో చిరుకి జోడీగా నయనతార, తమన్నా నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది స్వరకల్పన చేస్తున్నాడు.

వంశీ ని పొగిడా.. సుకుమార్ ను ఏమనలేదు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఈనెల 9 న గ్రాండ్ గా విడుదలకానున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగానే మహేష్ తాజాగా మీడియా తో ముచ్చటించారు. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

కొత్త సినిమా ప్రారంభానికి డేట్ ఫిక్స్
నా పేరు సూర్య సినిమా తరువాత ఏడాది గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ ఏడాది మాత్రం వరుస పెట్టి పలు స్టార్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

జెర్సీ 2 వీక్స్ కలెక్షన్స్
టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19 వ తేదీన రిలీజైన ఈ సినిమా ఇటు ప్రేక్షకులతో పాటు అటు ప్రముఖులను అలరించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ లో నాని తన సహజనటనతో అందరిని కంటతడి పెట్టించాడని.. తన నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక… ఓవర్సీస్‌లోనూ వసూళ్ళను బౌండరీలను దాటించేస్తోంది. ఇప్పటికే అక్కడ 1మిలియన్ డాలర్ క్లబ్‌లో కూడా…

36 వ వసంతంలో అడుగు పెడుతున్న త్రిష
తెలుగు, తమిళ భాషల స్టార్ హీరోయిన్ త్రిష మే నెల 5వ తేదీ తన 36 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. చెన్నై యతిరాజ్ కాలేజ్ లో BBA కోర్స్ చేసిన త్రిష 1999 సంవత్సరం లో అందాల పోటీలలో పాల్గొని మిస్ సేలం, మిస్ మద్రాస్ అవార్డ్స్ అందుకున్నారు . 2001సంవత్సరం లో మిస్ ఇండియా అందాల పోటీ లో పాల్గొని బ్యూటీ ఫుల్ స్మైల్ అవార్డ్ గెలుపొందారు. ప్రముఖ సింగర్ ఫల్గుణి పాథక్ పాడిన తేరీ చునర్ ఉడ్ ఉడ్ జాయే వీడియో తో నటిగా కెరీర్ ప్రారంభించారు. 2002 సంవత్సరం లో మౌనం పేసియదే మూవీ తో కోలీవుడ్, 2003 సంవత్సరం లో నీ మనసు నాకు తెలుసు మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు.

మహానటి కి మరో అరుదైన గౌరవం
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మహానటి'. గత ఏడాది రిలీజైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో అరుదైన ఘనత దక్కింది.

మహర్షి నుండి 'ఇదే కదా నీ కథ' సాంగ్ రిలీజ్
మహర్షి మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే… ఇంకా నాలుగురోజులంటే నాలుగు రోజులు మాత్రమే ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. ఈ లోపు ఎంత ప్రమోషన్ చేయాలో అంత ప్రమోషన్ చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఏదో ఒక రకంగా మహర్షి సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా.. రోజుకో అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా పాటల్ని యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ తీసుకొస్తోంది.

సమ్మర్ బాక్స్ ఆఫీస్ హిట్స్
ఏప్రిల్ నెలలో సమ్మర్ సీజన్ సినిమా సందడి మొదలయింది. శివ నిర్వాణ దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ మూవీ ఏప్రిల్ 5 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి సమ్మర్ హిట్ మూవీ గా శుభారంభం చేసింది. రికార్డ్ కలెక్షన్స్ తో మజిలీమూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజయి డీసెంట్ హిట్ గా నిలిచి, హీరో సాయి తేజ్ ప్లాప్ సినిమాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్రలహరి మూవీ సాయి తేజ్ కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

మణిరత్నం కొత్త చిత్రం వివరాలు
దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్‌తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. గత ఏడాది భారీ తారాగణంతో ‘నవాబ్’ (తమిళంలో ‘చెక్క చివంత వానం’) సినిమాను తెరకెక్కించిన ఈ లెజెండరీ డైరెక్టర్… ఇప్పుడు మరోసారి అదే బాటలో తన అప్‌కమింగ్ మూవీని కూడా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు మణి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు మోహన్ బాబు, విక్రమ్, కార్తీ…

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కొత్త చిత్రం?
మాస్ మహారాజాగా అభిమానుల, ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న కథానాయకుడు రవితేజ. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చే రవితేజ… ఆ మధ్య తన జోరును తగ్గించాడు. అయితే… గత ఏడాది మళ్ళీ వరుసగా మూడు సినిమాలను చేసి తన అభిమానులలో ఫుల్ జోష్‌ను నింపాడు. ప్రస్తుతం… వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తనతో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో రవితేజ మరోసారి జట్టుకట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ సినిమా…

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’
స్టూడెంట్‌గా, కంపెనీ సి.ఇ.ఓ.గా, రైతుగా… ఇలా మూడు పార్శ్వాలున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అలాగే… ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతిబాబు ముఖ్య భూమికలను పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని… ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలను తారా…

మహర్షి లోనూ సేమ్ సీన్ కానీ..!
శివ కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో మహేష్ చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ ఒక్క బులెట్ లా పేలుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ ప్రెస్ మీట్ కూడా గుర్తుండే ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ లో మీడియాపై మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పే ఒక్కో డైలాగ్ కు విజిల్స్ పడ్డాయి. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

యూరప్ లాంగ్ షెడ్యూల్ లో మహానటి
'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్.. ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాత వాసి' సినిమాలు చేసినా రాని గుర్తింపు అలనాటి అందాల తార మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి తెచ్చుకుంది. 'మహానటి' సినిమాలో నటించిన కీర్తి ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ్ లోనే కాదు.. బాలీవుడ్ నుండి కూడా ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

అప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ - ఇప్పుడు మహర్షి
పాపం చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు కాస్త ఇబ్బందిగానే మారాయని చెప్పొచ్చు. ఏప్రిల్ లో రిలీజ్ చేసుకున్న సినిమాల పనే బెటర్. ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకున్నాయి. నిజానికి ఏప్రిల్ లో కూడా గట్టి పోటీనే ఇచ్చాయి.. మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు. కరెక్ట్ గా వారం వారం గ్యాప్ లో వచ్చినా ఈసినిమాల్లో కంటెంట్ బలంగా ఉండటంతో మూడు సినిమాలు హిట్టయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

ఏడాది గ్యాప్‌లో తెలుగు తెరపై ఇద్దరు క్రేజీ బాలీవుడ్ భామల సందడి
టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల సందడి కొత్తేమీ కాదు. హిందీలో రాణించిన పలువురు కథానాయికలు తెలుగునాట కూడా అలరించారు. అయితే… వారిలో కొందరు ఒకటి, రెండు సినిమాలకు పరిమితమవగా… మరికొందరు తెలుగు చిత్రసీమలో కూడా తమ హవాను కొనసాగించారు. ఈ నేపథ్యంలో… తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సత్తా చాటడానికి ఇద్దరు యంగ్ అండ్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీస్ సిద్ధమవుతున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు… శ్రధ్ధా కపూర్, అలియా భట్.

మజిలీ 4 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
సమ్మర్ లో వచ్చిన మొదటి సినిమా మజిలీ మంచి హిట్టయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజై నాలుగో వారంలోకి అడుగుపెట్టినా కూాడా తన సత్తా చాటుతోంది. రెండో వారంలోనే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాగ చైతన్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో వారంలోనే అదే ఊపును కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరి ఈ నాలుగు వారాల్లో మజిలీ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్డే
హిట్ మూవీ ఒక లైలా కోసం తో టాలీవుడ్ కు ఎంటరయిన పూజ హెగ్డే అనతి కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మూవీస్ లో నటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్నారు. ఇప్పుడు వాల్మీకి మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. వాల్మీకి మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.