పాపం చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు కాస్త ఇబ్బందిగానే మారాయని చెప్పొచ్చు. ఏప్రిల్ లో రిలీజ్ చేసుకున్న సినిమాల పనే బెటర్. ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకున్నాయి. నిజానికి ఏప్రిల్ లో కూడా గట్టి పోటీనే ఇచ్చాయి.. మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు. కరెక్ట్ గా వారం వారం గ్యాప్ లో వచ్చినా ఈసినిమాల్లో కంటెంట్ బలంగా ఉండటంతో మూడు సినిమాలు హిట్టయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదే నెలలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్ ను మార్చుకున్నాయి. దానికి కారణం తెలిసిందే. అవెంజర్స్ ఎండ్ గేమ్. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో చాలా సినిమాలు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అర్జున్ సురవరం సినిమా కాని… ఏబీసీడీ కానీ.. ఇలా పలు సినిమాలు తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక అవెంజర్స్ కు వచ్చిన రెస్పాన్స్.. కలెక్షన్స్ చూస్తుంటే లేట్ అయినా.. వాయిదా వేసుకోవడమే బెటర్ అనేలా ఉన్నాయి.
ఇక మే ఫస్ట్ వీక్ అయినా సినిమాను రిలీజ్ చేద్దామనుకుంటే.. మే 9 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లి సినిమా మహర్షి రిలీజ్ కు రెడీగా ఉంది. దీంతో ఫస్ట్ వీక్ కూడా ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే మే రెండో వారంలో సినిమా రిలీజ్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అర్జున్ సురవరం, ఏబీసీడీ సినిమాలు మే17 వ తేదీని లాక్ చేసుకోగా.. సీత సినిమా మే 24న రిలీజ్ కానుంది. అయితే మహర్షి సినిమా కనుక హిట్ అయితే… ఈ సినిమాలకు కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. పోనీ ఈ నెల చివర రిలీజ్ చేద్దామనుకుంటే.. ఆల్రెడీ మే 31 న చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మొత్తానికి ఈ మూడు సినిమాలు షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. రిలీజ్ కు సరైన డేట్ మాత్రం కుదురలేదు. అప్పుడేమో అవెంజర్స్ ఎండ్ గేమ్.. ఇప్పుడేమో మహేష్ మహర్షి వల్ల చిన్న సినిమాల రిలీజ్ కు చాలా కష్టాలొచ్చాయి.
[subscribe]
[youtube_video videoid=ByjXIbg4hjw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: