స్టూడెంట్‌గా, కంపెనీ సి.ఇ.ఓ.గా, రైతుగా… ఇలా మూడు పార్శ్వాలున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అలాగే… ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతిబాబు ముఖ్య భూమికలను పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని… ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలను తారా స్థాయికి పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కమిటీ జీరో కట్స్‌తో యు/ఎ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా ‘మహర్షి’ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=99HP5NvZ7iY ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: