యూరప్ లాంగ్ షెడ్యూల్ లో మహానటి

Keerthy Suresh New Movie Shoot Happening In Europe,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Shooting Updates,Keerthy Suresh Next Film News,Keerthy Suresh Next Film Shooting Location,Keerthy Suresh New Movie Shoot in Foreign
Keerthy Suresh New Movie Shoot Happening In Europe

 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్.. ఆ తరువాత ‘నేను లోకల్’, ‘అజ్ఞాత వాసి’ సినిమాలు చేసినా రాని గుర్తింపు అలనాటి అందాల తార మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి తెచ్చుకుంది. ‘మహానటి’ సినిమాలో నటించిన కీర్తి ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ్ లోనే కాదు.. బాలీవుడ్ నుండి కూడా ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇక ‘మహానటి’ సినిమా తరువాత తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్.. మరోసారి లేడి ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ షూటింగ్ లో భాగంగానే కీర్తి సురేష్ అండ్ టీమ్ యూరప్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడే 45రోజుల లాంగ్ షెడ్యూల్ జరుపుకోనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరకల్లా ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

కాగా నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతూ.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్ కోనేరు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందించనున్నాడు. మరి మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ తెలుగులో ఒప్పుకున్న మరో లేడి ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. ‘మహానటి’ తర్వాత తెలుగులో వచ్చిన అవకాశాలేవీ అంగీకరించని కీర్తి.. ఏరి కోరి ఈ సినిమా ఓకే చేసిందంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో.

[subscribe]


[youtube_video videoid=G9nrHltl0ng]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =