మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి
. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో చిరుకి జోడీగా నయనతార, తమన్నా నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది స్వరకల్పన చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో నటించబోతోందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను నేరేట్ చేసే పాత్రలో స్వీటీ కనిపిస్తుందనేదే ఆ కథనాల సారాంశం. అంతేకాదు… వీరి కాంబినేషన్‌లో కథానుసారం ఓ ప్రత్యేక గీతం కూడా ఉంటుందని సమాచారం. వాస్తవానికి కెరీర్ ఆరంభంలోనే ‘స్టాలిన్’(2006) కోసం చిరుతో కలసి నర్తించింది అనుష్క. కట్ చేస్తే… మళ్ళీ ఇప్పుడు పదమూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘సైరా’ కోసం చిరుతో రెండో సారి ఆడిపాడనుండడం విశేషం. కాగా… ఈ గీతానికి సంబంధించిన చిత్రీకరణ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. టాకీ పార్ట్ పూర్తయిన తర్వాత… ఈ పాటను చిత్రీకరించే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు టాక్. త్వరలోనే అనుష్క ఎంట్రీపై అధికారిక ప్రకటన రావచ్చు. దసరా కనుకగా సైరా
ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=hiN3n-q3w9g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: