36 వ వసంతంలో అడుగు పెడుతున్న త్రిష

Telugu FilmNagar Wishes Actress Trisha A Very Happy Birthday,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Wishing a Very Happy Birthday to Trisha,Trisha Turns 36 Years For Today,Actress Trisha Birthday Special News,Trisha Celebrating Her 36th Birthday
Telugu FilmNagar Wishes Actress Trisha A Very Happy Birthday

తెలుగు, తమిళ భాషల స్టార్ హీరోయిన్ త్రిష మే నెల 5వ తేదీ తన 36 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. చెన్నై యతిరాజ్ కాలేజ్ లో BBA కోర్స్ చేసిన త్రిష 1999 సంవత్సరం లో అందాల పోటీలలో పాల్గొని మిస్ సేలం, మిస్ మద్రాస్ అవార్డ్స్ అందుకున్నారు . 2001సంవత్సరం లో మిస్ ఇండియా అందాల పోటీ లో పాల్గొని బ్యూటీ ఫుల్ స్మైల్ అవార్డ్ గెలుపొందారు. ప్రముఖ సింగర్ ఫల్గుణి పాథక్ పాడిన తేరీ చునర్ ఉడ్ ఉడ్ జాయే వీడియో తో నటిగా కెరీర్ ప్రారంభించారు. 2002 సంవత్సరం లో మౌనం పేసియదే మూవీ తో కోలీవుడ్, 2003 సంవత్సరం లో నీ మనసు నాకు తెలుసు మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ త్రిష నటించిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ సినిమాలు ఘన విజయం సాధించాయి.టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో త్రిష నటించారు. తెలుగు, తమిళ భాషలలోనే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో నటించిన త్రిష, స్కూటీ పెప్, ఫాంటా, వివెల్, కోల్ గేట్ మొదలగు వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. పెటా గుడ్ విల్ అంబాసిడర్ గా,యూనిసెఫ్ సెలబ్రిటీ అడ్వొకేట్ గా పనిచేస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో బాల్య వివాహం, బాల కార్మికులు, వేధింపులు వంటి అంశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=hKDnz0e6338]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 10 =