వంశీ ని పొగిడా.. సుకుమార్ ను ఏమనలేదు

Mahesh Babu Latest Interview about Maharshi

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఈనెల 9 న గ్రాండ్ గా విడుదలకానున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగానే మహేష్ తాజాగా మీడియా తో ముచ్చటించారు. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రీ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించారు కదా.. మీకు పర్సనల్ గా ఏ క్యారెక్టర్ నచ్చింది?

నాకు మూడు షేడ్స్ చాలా బాగా నచ్చాయి.. అయితే నా ఫేవరెట్ అంటే కాలేజ్ ఎపిసోడ్.. నేను కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను.. అప్పుడే వంశీ తో చెప్పా ఈ కాలేజ్ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్.. దీన్ని చాలా కాన్ఫిడెంట్ గా తీయాలన్నాను.. ఎందుకంటే నా కెరీర్ మొదలుపెట్టి 2 దశాబ్దాలు అయిపోయింది.. 25 ఫిలింస్ అయిపోయాయి.. ఈ టైంలో కాలేజ్ అంటే కష్టం.. అది కూడా ఏదో 5 నిమిషాలు కాదు… 45 నిమిషాలు ఉంటుంది.. అది కన్విన్సింగ్ గా మేము తీయగలిగితే అచీవ్ అయినట్టే. కాలేజ్ ఎపిసోడే నాకు నచ్చిన పార్ట్.. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు కానీ చాలా గర్వంగా ఉంది.

ఈ సినిమా అంత ఖచ్చితంగా చేయాలి అని అనిపించిన పాయింట్ ఏంటి..? అంత ఇన్నోవేటివ్ ఏం అనిపించింది ఈ సినిమాలో..?

నిజం చెప్పాలంటే కథేనండి. నేను మొన్నఫంక్షన్ లో చెప్పినట్టు ఏదో 10 నిమిషాలు కథ విని వంశీని పంపించేద్దామనుకున్నాను.. ఎందుకంటే నాకు చాలా కమిటిమెంట్స్ ఉన్నాయి అప్పుడు.. 40 నిమిషాలు నాకు కథ వినిపించినప్పుడు నేను థ్రిల్ ఫిలయ్యాను..అయితే అప్పుడే చెప్పా తనకి నేను రెండు సినిమాలు తీయాలని.. తను నేను వెయిట్ చేస్తానని చెప్పాడు…మీరు తప్ప మహర్షి ఎవరూ చేయలేరు.. మీరే కనిపిస్తున్నారు ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తానని చెప్పాడు

ఈ సినిమాలో మూడు లుక్స్ లో కనిపించారు కదా.. రైతుగా తలపాగా కట్టి చేయడం ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది?

మేము సినిమాలో మూడు గెటప్స్ అనుకున్నాం… అందులో ఇది కూడా ఒకటి.. వంశీ ముందే చెప్పాడు.. స్టూడెంట్ గా ఒకటి ఉంటుంది.. సీఈవో గా.. విలేజ్ కి వెళ్లినప్పుడు ఒక గెటప్ ఉంటుందని. ఇంతకు ముందు అందరూ ఒకే లుక్.. ఒకే లుక్ లో చేస్తున్నానని చాలా మంది అన్నారు.. కానీ ఇందులో మూడు లుక్స్ ఉంటాయి.. అందులో నాకు అర్ధంకానిది ఏంటంటే.. క్యారెక్టర్ పరంగానే లుక్ ఉంటుంది.. ఎవరు ఏ లుక్ చేసినా హెయిర్ స్టయిల్ మార్చడం.. గడ్డం పెంచడమే తప్ప కొత్తగా ఏముండదు..

మల్టీ ప్రొడ్యూసర్ బ్యానర్స్ లో చేశారు ఎలా ఉంది ఎక్స్ పీరియన్స్?

మహర్షి చాలా పెద్ద ప్రాజెక్ట్.. మూడు చాలా పెద్ద బ్యానర్లు.. ముగ్గురు ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు.. ముగ్గురికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.

ఇంతకు ముందు ఇయర్ కు రెండు సినిమాలైనా వచ్చేవి.. ఇప్పుడు మరీ ఒక సినిమానే వస్తుంది.. ఇక నుండి ఇయర్ కు రెండు సినిమాలైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చా?

ఈ సినిమా స్టార్ చేసిన తరువాత నేను ఒక్క నెల మాత్రమే గ్యాప్ తీసుకున్నానండి… నాన్ స్టాప్ గా పని చేస్తూనే ఉన్నా.. ఈ రోజుల్లో సినిమా అనేది ఒక టఫ్ టాస్క్ అయిపోయింది.. నాన్నగారి టైంలో వాళ్లందరూ 300 పైగా సినిమాలు చేశారు.. ఇప్పుడు 25 సినిమాకే ల్యాండ్ మార్క్ సినిమాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. ఒక పెద్ద సినిమా చేయాలంటే మినిమమ్.. 8 నుండి 9 నెలల టైం పడుతుంది.. ఒక పర్ ఫెక్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే అంత టైం పడుతుంది.. అది నా చేతుల్లో లేదు కదా..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరీ గారి గురించి.. ఇంకా మీ కెరీర్ లో ఎంతో మంది డైరెక్టర్ల గురించి ప్రస్తావించలేదు?

అది నా మిస్టేకే.. పూరీకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే పోకిరి సినిమా నన్ను సూపర్ స్టార్ ను చేసింది.. అలాగే సుకుమార్ కు థ్యాంక్స చెప్పాలనుకున్నా… వన్ అనేది ఒక కల్ట్ ఫిలిం.. అలాగే నా కొడుకు గౌతమ్ తో నటించే అవకాశం కలిగింది.. ఆ ఫంక్షన్ లోనే ఒకటి అన్నాను.. వంశీ రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడు.. ఈరోజుల్లో రెండు నెలలు కూడా ఎవరూ వెయిట్ చేయరు స్క్రిప్ట్ పెట్టుకొని అన్నాను.. అది నేను వంశీని పొగిడాను తప్పా.. సుకుమార్ గారిని పాయింట్ అవుట్ చేసి చెప్పలేదు. దాని మీద కూడా న్యూస్ లు రాశాారు. సుకుమారు కు మహేష్ పంచ్ అని.. సుకుమార్ గారు స్పెషల్ డైరెక్టర్.. స్పెషల్ ఫ్రెండ్.. మేము తప్పకుండా సినిమా చేస్తాం.. అనవసరమైన కన్ఫ్యూజన్ మాత్రమే..

ఈచిత్రంలో శ్రీమంతుడు పోలికలు ఉన్నాయా ?

ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ సినిమా చూసాక తెలుస్తుంది మీకు సినిమా కు శ్రీమంతుడు తో పోలికలు ఉన్నాయా అని ఈ రెండు కంప్లీట్ గా డిఫ్రెంట్ మూవీస్.

కొత్త దర్శకులు చాలా మంది వస్తున్నారు.. చాలా ఫ్రెష్ స్క్రిప్ట్స్ కూడా వస్తున్నాయి.. మీరు కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయరని అంటున్నారు వారితో మీరు సినిమాలు చేయరా?

చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు.. ఫ్రెష్ ఫిలింస్ తీస్తున్నారు.. కానీ నాకు ఇంత వరకూ కరెక్ట్ స్టోరీ చెప్పలేదు.. కథ నచ్చితే యువ దర్శకులతో పనిచేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’కొత్త వారిని నేను ఎంకరేజ్ చేయడం లేదనేది తప్పు మాట..

ఎప్పటినుండో వెయిటే చేస్తున్న కాంబినేషన్స్ రాజమౌళి, బోయపాటితో సినిమాలు వచ్చే అవకాశం ఉందా?

నేను రాజమౌళి గారు డిసైడ్ అయ్యాం.. ఆయన కమిట్ మెంట్స్.. నా కమిట్ మెంట్స్ అయిపోయిన తరువాత సినిమా చేస్తాం..

చాలా మంది మిమ్మల్ని హిస్టారికల్ రోల్ లో చూడాలనుకుంటున్నారు… మీకు ఏ హిస్టారికల్ క్యారెక్టర్ అంటే ఇష్టం?

నాకు హిస్టారికల్ రోల్స్ చేయాలంటే చాలా భయమండి. రాజమౌళి లాంటి డైరెక్టర్ చేస్తే తప్పా..ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలతో హ్యాపీగానే ఉన్నాను.

మీ థియేటర్లో సినిమా చూశారా?

ఇప్పటి వరకూ చూడలేదు. ‘‘అందరూ అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ బాగుందని అంటున్నారు. ఆ సినిమా చూద్దామని ఏఎంబీ సినిమాస్‌లో టికెట్లు అడిగితే లేవని అన్నారు (నవ్వుతూ).. నేడో.. రేపో ఈ సినిమా చూస్తా’’

మల్టీ స్టారర్ ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా మీ దగ్గరికి? మళ్లీ చేసే అవకాశం ఉందా?

నా దగ్గరకు ప్రస్తుతానికైతే అలాంటి ప్రాజెక్టులు రాలేదు.. వస్తే ఖచ్చితంగా చేస్తాను.. మల్టీస్టారర్‌ సినిమాలు చేయడం జోక్ కాదండి.. ఒక ప్రాపర్ డైరెక్టర్ ఉండాలి.. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉండే పెద్ద హీరోలతో మల్టీస్టారర్ చేయొచ్చు.. అదంతా డైరెక్టర్ పై ఆధారపడి ఉంటుంది.

[subscribe]


[youtube_video videoid=oz2otTIhD_k ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here