గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ కొత్త చిత్రం?

Ravi Teja To Work With Gopichand Malineni Again,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja and Director Gopichand Malineni Combo in Back,Director Gopichand Malineni and Ravi Teja To Team Up Again,Ravi Teja Next Film With Gopichand Malineni,Ravi Teja Next Project Details,Director Gopichand Malineni New Movie With Ravi Teja
Ravi Teja To Work With Gopichand Malineni Again

మాస్ మహారాజాగా అభిమానుల, ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న కథానాయకుడు రవితేజ. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చే రవితేజ… ఆ మధ్య తన జోరును తగ్గించాడు. అయితే… గత ఏడాది మళ్ళీ వరుసగా మూడు సినిమాలను చేసి తన అభిమానులలో ఫుల్ జోష్‌ను నింపాడు. ప్రస్తుతం… వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తనతో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో ర‌వితేజ మరోసారి జట్టుకట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. మరి ఇప్పటికే ‘డాన్ శీను’, ‘బలుపు’ రూపంలో రెండుసార్లు విజయాలను అందుకున్న ఈ ద్వయం… తమ అప్‌కమింగ్ ఫిలింతో మరో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్‌ను నమోదు చేస్తుందేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]


[youtube_video videoid=nSD-WshUFS8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =