శివ కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో మహేష్ చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ ఒక్క బులెట్ లా పేలుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ ప్రెస్ మీట్ కూడా గుర్తుండే ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ లో మీడియాపై మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పే ఒక్కో డైలాగ్ కు విజిల్స్ పడ్డాయి. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ సీన్ గురించి ఎందుకబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఇలాంటి ప్రెస్ మీట్ సీనే ఇప్పుడు మహర్షి సినిమాలో కూడా ఉండబోతుందట. ఈ సినిమాలో మహర్షి త్రీ షేడ్స్ లో కనిపిస్తాడన్న సంగతి ఇటీవల ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. కాలేజ్ స్టూడెంట్ గా.. ఓ సక్సెస్ ఫుల్ సీఈఓ గా… నాగలి పట్టుకుని వ్యవసాయం చేసే వ్యక్తిగా ఇలా త్రీ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రెస్ మీట్ లో ఆయన రైతుల గురించి మాట్లాడతాడట. ఈ సీన్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట. చివరి 20 నిమిషాలు మాత్రం ఎమోషన్స్ తో ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కిస్తాడని అంటున్నారు. మరి నిజంగానే ప్రెస్ మీట్ ఉందో?లేదో? ఉంటే అది కూడా అంతటి ఇంపాక్ట్ చూపిస్తుందో? లేదో? తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=ByjXIbg4hjw ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)