మహర్షి నుండి ‘ఇదే కదా నీ కథ’ సాంగ్ రిలీజ్

Idhe Kadha Nee Katha Song From Maharshi Movie Out Now,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Idhe Kadha Nee Katha Lyrical Song,Maharshi Movie Songs,Maharshi Movie Another Song,Idhe Kadha Nee Katha Lyrical Video Song From Maharshi
Idhe Kadha Nee Katha Song From Maharshi Movie Out Now

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహర్షి మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే… ఇంకా నాలుగురోజులంటే నాలుగు రోజులు మాత్రమే ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. ఈ లోపు ఎంత ప్రమోషన్ చేయాలో అంత ప్రమోషన్ చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఏదో ఒక రకంగా మహర్షి సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా.. రోజుకో అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా పాటల్ని యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ తీసుకొస్తోంది.

ఇప్పటికే ‘ఛోటీ ఛోటీ బాతే’, ‘ఎవరెస్ట్ అంచున’, ‘నువ్వే సమస్తం’, ‘పాలా పిట్ట’, ‘పదరా.. పదరా’, ‘ఫిర్ సే’ లిరిక్ సాంగ్స్‌ను యూట్యూబ్ లో విడుదల చేసిన యూనిట్ తాజాగా ‘ఇదే కదా నీ కథ’ అంటూ సాగే మరో పాట విడుదల చేసింది. దీనికి ‘ద సోల్ ఆఫ్ రిషి’ అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు.

కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా… ఇంకా జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ, వెన్నెల కిషోర్ పలువురు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు. మరి ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ నుంచి వస్తున్న సినిమా కావడం, విలక్షణ చిత్రాల డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో..


[subscribe]
[youtube_video videoid=oz2otTIhD_k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 1 =