టాలీవుడ్లో బాలీవుడ్ హీరోయిన్ల సందడి కొత్తేమీ కాదు. హిందీలో రాణించిన పలువురు కథానాయికలు తెలుగునాట కూడా అలరించారు. అయితే… వారిలో కొందరు ఒకటి, రెండు సినిమాలకు పరిమితమవగా… మరికొందరు తెలుగు చిత్రసీమలో కూడా తమ హవాను కొనసాగించారు. ఈ నేపథ్యంలో… తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సత్తా చాటడానికి ఇద్దరు యంగ్ అండ్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీస్ సిద్ధమవుతున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు… శ్రధ్ధా కపూర్, అలియా భట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘ఆషిఖీ 2’తో హిందీనాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రధ్ధా కపూర్… ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ట్రైలింగ్వల్ మూవీ ‘సాహో’లో కథానాయికగా నటిస్తోంది. హీరోయిన్లంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైపోతున్న ఈ రోజుల్లో… ‘సాహో’లో మాత్రం ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనుందట శ్రధ్ధ. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే… దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న మల్టీలింగ్వల్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’లో క్రేజీ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఓ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మాసివ్ మల్టీస్టారర్ మూవీలో చరణ్‌కు జోడీగా కనిపించనుంది అలియా. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న తెరపైకి రానుంది. ఇలా… ఏడాది గ్యాప్‌లో క్రేజీ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఇద్దరు బాలీవుడ్ భామలు… టాలీవుడ్లో కూడా తమదైన ముద్రను వేస్తారేమో చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=8HFxQsWRMTM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























