మహానటి కి మరో అరుదైన గౌరవం

Mahanati Gets Selected for the prestigious Shanghai International Film Festival,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh Selected For prestigious Shanghai International Film Festival,Keerthy Suresh Gets Intivation From Shanghai International Film Fest,Actress Keerthy Suresh Goes to Shanghai,Shanghai International Film Festival
Mahanati gets selected for the prestigious Shanghai International Film Festival

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. గత ఏడాది రిలీజైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో అరుదైన ఘనత దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చైనాలోని షాంగై లో జరిగే ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కు ‘మహానటి’ కూడా సెలెక్ట్ అయింది.జూన్ 15నుండి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి ఇండియ‌న్ సినిమాగా మ‌హాన‌టి అరుదైన ఘ‌న‌త సాధించింది.

కాగా, ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్రకాష్ రాజ్, క్రిష్, దివ్య వాణి, షాలిని పాండే, భానుప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

[subscribe]


[youtube_video videoid=BYaB0AvfojU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here