
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 104


భారీ స్థాయిలో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్!

ఇన్నేళ్లకు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు

నానార్థాలకు దారితీస్తున్న నాగార్జున - జగన్ కలయిక

సుప్రియతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్!

శర్వా, కాజల్ కోసం 250 మంది!

సీక్వెల్ ప్లాన్‌లో శ్రీనువైట్ల?

సైనిక కుటుంబాలకు సాయం

కొత్త సినిమాలతో బిజీగా హీరో రానా

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మూవీ కి కొత్త టైటిల్

లవర్స్ డే మూవీ క్లైమాక్స్ లో మార్పు

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ట్రైలర్ రిలీజ్

రానా కొత్త సినిమా అప్ డేట్

సోలో హీరోగా - క్రైమ్ కామెడీకి గ్రీన్ సిగ్నల్!

‘ఎన్టీఆర్’ బయోపిక్ అందుకే బాలకృష్ణతో చేయలేదు!

వేర్వేరు నేపథ్యాలతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్స్
గత ఏడాది `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను అందుకున్న యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ... ఈ సంవత్సరం రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న `డియర్ కామ్రేడ్` కాగా... మరొకటి సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని సినిమా. ఈ రెండు సినిమాలు కూడా... వేర్వేరు నేపథ్యాలతో తెరకెక్కుతున్నాయని సమాచారం.

భారీ స్థాయిలో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్!
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగం సంక్రాంతి పండుగకానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేశారు. ఇక రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన మహానాయకుడు పార్ట్ ను ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఇన్నేళ్లకు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు
పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక ఆ తరువాత పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు కు కూడా ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.

నానార్థాలకు దారితీస్తున్న నాగార్జున - జగన్ కలయిక
ఎప్పుడు? - ఎక్కడ? అనే ప్రశ్నలకు దొరికినంత ఈజీగా ఎందుకు? అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు. ఆ ప్రశ్నకు అంత ఈజీగా జవాబు దొరికితే ఆ కలయికలో ఉత్కంఠ ఏముంటుంది? అందుకే జవాబును జనాల ఊహాగానాలకు వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోతుంటారు సినీ రాజకీయ రంగాల సెలబ్రెటీలు.

సుప్రియతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్!
కర్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పంజా సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఆ తరువాత బాహుబలి, క్షణం, గూఢచారి వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇక ఇన్నేళ్ల అడివి శేష్ కెరీర్ లో తనపై రూమర్లు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు.

లో బజ్- మార్చి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో?
గత ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించాయి. కొన్ని సినిమాలు భారీ హిట్టందుకోగా.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ ఏడాది కూడా పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజయి సందడి చేశాయి. ఎన్టీఆర్ మహానాయకుడు, పేట, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలు రిలీజవ్వగా వాటిలో ఎఫ్ 2 మాత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిజానికి ఇది మంచి ఆరంభం కాదనే చెప్పొచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

శర్వా, కాజల్ కోసం 250 మంది!
ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాను పూర్తి చేసిన శర్వానంద్, ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ లో గత గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరణ చేస్తుంది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి జోడీగా రాశీ ఖన్నా?
అందాల తార రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. `ఇమైక్క నోడిగళ్` (తెలుగులో `అంజలి సి.బి.ఐ`గా రిలీజ్ కానుంది), `అడంగ మారు` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ఉత్తరాది సోయగం... `అయోగ్య`, `సైతాన్ కా బచ్ఛా` సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే... విజయ్ సేతుపతి కాంబినేషన్‌లోనూ ఓ తమిళ సినిమాకి సంతకం చేసిందని కోలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... పోలీస్ స్టోరీగా తెరకెక్కిన `టెంపర్`కి రీమేక్‌గా `అయోగ్య` రూపొందగా... మరో కాప్ స్టోరీ రీమేక్‌కి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

తొలి చిత్ర దర్శకుడి సినిమాలో... విలన్ గా నాని?
దాదాపు మూడేళ్ళ క్రితం వచ్చిన `జెంటిల్ మన్`లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన నాని... అతి త్వరలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించనున్నాడట. తనని కథానాయకుడిగా పరిచయం చేసిన దర్శకుడి కాంబినేషన్‌లో ఈ పాత్ర చేయనున్నాడట ఈ నేచురల్ స్టార్. కాస్త వివరాల్లోకి వెళితే... ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన `అష్టా చమ్మా`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని... అనతికాలంలోనే కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక దశలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినా... `భలే భలే మగాడివోయ్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చి... వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు…

సీక్వెల్ ప్లాన్‌లో శ్రీనువైట్ల?
వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఒక దశలో వరుస విజయాలతో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... గత కొంతకాలంగా ట్రాక్ తప్పాడు. తాజాగా వచ్చిన `అమర్ అక్బర్ ఆంటొని` కూడా ఆశించిన విజయం సాధించకపోవడంతో... తదుపరి చిత్రం విషయంలో మరింత ప్లానింగ్‌తో ఉన్నాడని సమాచారం.

సైనిక కుటుంబాలకు సాయం
నిత్యం సైనిక పహారా తో , అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉన్న కల్లోల ప్రాంతం జమ్ము కాశ్మీర్. గత వారం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లోని పుల్వామా జిల్లా లో జరిగిన ఉగ్రదాడి లో నలభై మంది కి పైగా CRPF జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా భారత సైన్యం పై ఇంతటి తీవ్రమైన దాడి జరుగలేదు. ఇప్పుడు రెండు అణ్వాయుధ దేశాలు ఇండియా, పాకిస్థాన్ ల మధ్య యుద్ధ సూచనలు కనపడుతున్నాయి

కొత్త సినిమాలతో బిజీగా హీరో రానా
బాహుబలి మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి మోస్ట్ వాంటెడ్ హీరో గా మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న రానా దగ్గుబాటి మూడు కొత్త సినిమాలు ప్రారంభానికి సిద్ధం గా ఉన్నాయి. ప్రస్తుతం రానా నటిస్తున్న 1945 (తెలుగు, తమిళ్ ), హాథీ మేరే సాథీ (హిందీ ) సినిమాల షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి.

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మూవీ కి కొత్త టైటిల్
సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తమిళం లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. E4 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై 6 నేషనల్ అవార్డ్స్ విన్నర్ బాల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో తనయుడు ధృవ్ విక్రమ్ ను హీరోగా కోలీవుడ్ కు పరిచయం చేస్తూ వర్మ మూవీ రూపొందింది. వర్మ మూవీ సంతృప్తికరం గా లేకపోవడంతో టోటల్ మూవీ ని రీషూట్ చేయనున్నారు.

లవర్స్ డే మూవీ క్లైమాక్స్ లో మార్పు
ఎన్నో అంచనాల మధ్య లవర్స్ డే సినిమా ఈనెల ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై అంత క్రేజ్ ఏర్పడటానికి ఓ రకంగా ఈ సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ హావ భావాలే కారణం అని చెప్పొచ్చు. మాణిక్య మలరావి అన్న పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు ఎక్కడాలేని క్రేజ్ ఒక్కసారిగా వచ్చిపడింది.

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ట్రైలర్ రిలీజ్
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆ అభినయాచార్యుని మరణంతో ఉలిక్కిపడ్డ నాటక సినీ రంగాలు
నిన్న సినీ నాటక రంగాలకు నిజమైన దుర్దినం. ఈ రెండు రంగాలకు ఎందరెందరో నటీనటులను పరిచయం చేసి, తర్ఫీదు ఇచ్చి గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దిన "దీక్షితులు మాస్టారు" ఇక లేరు అన్న దుర్వార్తను మోసుకొచ్చిన నిజమైన దుర్దినం నిన్న. తాము ఇష్టపడిన రంగాలపట్ల కొందరు వ్యక్తులకు అమితమైన ప్రేమ ఉంటుంది.. అది సహజం... అలాగే నాటక సినీ రంగాల పట్ల చాలామందికి అభిమానం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రం "అంకిత భావం" ఉంటుంది. కానీ ఇష్టమైన నాటక సినీ రంగాల కోసం సర్వస్వాన్ని సమర్పించే

రానా కొత్త సినిమా అప్ డేట్
ప్రస్తుతం రానా పలు ప్రాజెక్టులతో చాలాా బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. హాతీ మేరీ సాతీ సినిమాతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప మరియు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూరల్ తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా రానా లిస్ట్ లో ఉన్నాయి. ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన డైరీలో మరో సినిమాకు స్పేస్ ఇచ్చాడు రానా.

నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ - అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్
ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో.. ఈశ్వర్, తుయా చక్రబోర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని ఈ నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

సోలో హీరోగా - క్రైమ్ కామెడీకి గ్రీన్ సిగ్నల్!
అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆ సినిమాతో మంచి సక్సెస్ సాధించి..అదే సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయిన నటుడు అల్లరి నరేష్. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు.. కమర్షియల్ మూవీస్ సైడ్ వెళ్లకుండా.. తనకు పర్ఫెక్ట్ గా సూటయ్యే కామెడీనే ఎంచుకొని ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించాడు. ఇక రొటీన్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులకు నరేష్ సినిమాలు కూడా బోర్ కొట్టాయి. అందుకే గత కొద్ది కాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు.

‘ఎన్టీఆర్’ బయోపిక్ అందుకే బాలకృష్ణతో చేయలేదు!
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సంగతేమో కానీ..వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఫస్ట్ లుక్ నుండి మొదలుకొని ఇప్పటి వరకూ తన స్టైల్ లో స్ట్రాటజీలో వెళ్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు వర్మ. ప్రమోషన్స్ లో కూడా కాస్త వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి నుండి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. వర్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోజుకో ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు.