ఎన్నో అంచనాల మధ్య లవర్స్ డే సినిమా ఈనెల ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై అంత క్రేజ్ ఏర్పడటానికి ఓ రకంగా ఈ సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ హావ భావాలే కారణం అని చెప్పొచ్చు. మాణిక్య మలరావి అన్న పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు ఎక్కడాలేని క్రేజ్ ఒక్కసారిగా వచ్చిపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే సినిమాకు మాత్రం అంత సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. ఎన్నో అంచనాల మధ్య రిలీజై కాస్త నిరాశపరిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. ట్రాజెడీ ఎండింగ్ ఉన్న ఈ క్లైమాక్స్ సీన్ కు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. దీంతో ఈ విషయాన్ని కాస్త త్వరగానే గ్రహించిన చిత్రయూనిట్ క్లైమాక్స్ ను మార్చినట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ ను మళ్లీ షూట్ చేసి త్వరలోనే కొత్త క్లైమాక్స్ ను యాడ్ చేయనున్నారట. ఈ సందర్భంగా డైరెక్టర్ ఒమర్ మాట్లాడుతూ… రియలిస్టిక్‌గా ఉండాలని క్లైమాక్స్‌కి ట్రాజెడీ యాడ్ చేసాను.. ఆ క్లైమాక్స్ ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేదు.. అందుకే క్లైమాక్స్ మళ్ళీ షూట్ చేసామని చెప్పారు. మరి ఈ క్లైమాక్స్ ఆడియన్స్ కు ఎంతవరకూ నచ్చుతుందో చూద్దాం.
[youtube_video videoid=fIMyubstfhA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: