ఎప్పుడు? – ఎక్కడ? అనే ప్రశ్నలకు దొరికినంత ఈజీగా ఎందుకు? అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు. ఆ ప్రశ్నకు అంత ఈజీగా జవాబు దొరికితే ఆ కలయికలో ఉత్కంఠ ఏముంటుంది? అందుకే జవాబును జనాల ఊహాగానాలకు వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోతుంటారు సినీ రాజకీయ రంగాల సెలబ్రెటీలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చివరకు జనము, మీడియా ఒకరకంగా అనుకుంటే “ఓహో… మీకు అలా అర్థమైందా .. కానీ మా కలయిక అసలు పరమార్ధం ఇది” అంటూ సంబంధంలేని సమాధానం ఒకటి సర్వ్ చేస్తారు సెలబ్రెటీలనబడే చమత్కారులు. నిజాలు అంత ప్రాముఖ్యమైనవి కానప్పుడు… ప్రాముఖ్యమైనవే అయినా ప్రజలకు చెప్పకూడనివి అయినప్పుడు ఇలాంటి దాగుడుమూతలు తప్పవు.
ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఒక పార్టీ వారు మరొక పార్టీ ఆఫీసుల్లో, మీటింగుల్లో ఆకస్మిక దర్శనాలు ఇవ్వటం సహజమే. కానీ ఎప్పుడూ, ఎక్కడ, ఎలాంటి రాజకీయ ప్రస్థావన, ప్రభావ, ప్రమేయాలు లేని “అక్కినేని నాగార్జున” లాంటి సెలబ్రిటీ అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమవటాన్ని చూసి మీడియాతో పాటు సినీ రాజకీయ రంగాలు రెండూ ‘ఆహా’శ్చర్యపోయాయి.
ఈ రెండు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోని బార్బర్ షాపుల్లో గిరాకీ పూర్తిగా పడి పోయిందంట. ఎందుకా అని ఆరా తీస్తే నాగార్జున జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశాడో అర్థం కాక జనం జుట్టు పీకేసుకోవడంతో సెలూన్ లకు వెళ్ళే పని తప్పిందట. ఇలా అనుకుని నవ్వుకోవడం తప్ప వారి కలయికకు కారణం మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు.
ప్రస్తుతం నాగార్జున ఇంట ఏ శుభకార్యమూ లేదు… జగన్ ఇంట ఏ ప్రత్యేక వేడుకా లేదు. రెండు కుటుంబాల్లోనూ ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకపోయినప్పటికీ జరిగిన ఈ ఆకస్మిక భేటీకి అంతరార్థం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచించటం కూడా వేస్ట్. ఎందుకంటే ఈ కలయిక పరమార్థం ఏమిటో తెలియటానికి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.
అయితే ఇక్కడ పాలు తాగే పసివాడి లాజిక్కు కు కూడా అర్థమయ్యే పరమార్థం ఒకటుంది. నాగార్జున జగన్మోహన్ రెడ్డిని ఆంతరంగికంగా కలవాలి అనుకుంటే ఎవరు చూడకుండా, ఎవరి కంట పడకుండా కలవవచ్చు. కలిసిన సంగతి అందరికీ తెలియాలి కానీ ఎందుకు కలిశాడో మాత్రం తెలియకూడదు. అందుకే మీడియా ‘సాక్షి’గా, మీడియా ముందు నుండే వెళ్లి , మీడియాను మాత్రం కలవకుండా వెళ్ళటాన్ని బట్టి ఆ కలయిక ఒక ‘బహిరంగ రహస్యం’ గా సంచలనం సృష్టించాలన్నదే అసలు పరమార్ధం.
ఇది ఉత్తుత్తి కలయిక మాత్రం కాదు..
అయితే ఒకటి మాత్రం నిజం… ఇది మామూలుగా జరిగిన ఊసుపోని కలయిక మాత్రం కాదు. రాబోయే ఎన్నికలు అటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సిపికి do or die లాంటివి కావటంతో సినీ రాజకీయ రంగాల లోని ప్రతి ఒక్కరి కదలికకు ఒక ప్రాముఖ్యత, పరమార్థం ఉండి తీరుతాయి. ఒకవైపు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మూడొంతుల మెజారిటీతో తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం, రిటర్న్ గిఫ్టుల పేరిట ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో టిఆర్ఎస్ తలదూర్చడం, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సినీ రాజకీయ ప్రముఖుల ఆస్తులు, వ్యాపారాలు అన్ని హైదరాబాద్లోనే కేంద్రీకృతమయ్యాయి ఉండటం, ఇక్కడ “టిఆర్ఎస్- వై ఎస్ ఆర్ సి పి”ల మైత్రి బలపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఒక్క నాగార్జునే కాదు… ఇంకా చాలామంది సినీ ప్రముఖులు “లోటస్ పాండ్” వైపు అడుగులు వేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే సినిమా వాళ్ళు “కేసీఆర్- జగన్” ల వైపో ” చంద్రబాబు నాయుడు” వైపో తేల్చుకోవాల్సిన సమయం అతి దగ్గరలోనే ఉంది అనటానికి ఈ తాజా రాజకీయ పరిణామాలు సమీకరణాలే ఉదాహరణ.
[youtube_video videoid=6bxwva4sED0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: