వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఒక దశలో వరుస విజయాలతో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… గత కొంతకాలంగా ట్రాక్ తప్పాడు. తాజాగా వచ్చిన `అమర్ అక్బర్ ఆంటొని` కూడా ఆశించిన విజయం సాధించకపోవడంతో… తదుపరి చిత్రం విషయంలో మరింత ప్లానింగ్‌తో ఉన్నాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… శ్రీను వైట్ల తన 20 ఏళ్ళ కెరీర్‌లో మొదటి సారిగా ఓ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. వైట్ల సినీ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకంగా నిలచిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఢీ`(2007)కి కొనసాగింపుగా ఈ సీక్వెల్ మూవీ ఉంటుందని… `ఢీ` చిత్రంలో కథానాయకుడిగా నటించిన మంచు విష్ణుతో పాటు మరో హీరో కూడా ఇందులో నటించబోతున్నాడని సమాచారం. మరి… మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనైనా శ్రీను వైట్ల పూర్వ వైభవాన్ని చూస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=LKK0SZcdGaw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: