సోలో హీరోగా – క్రైమ్ కామెడీకి గ్రీన్ సిగ్నల్!

Allari Naresh Gives Green Signal For A Crime Comedy Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Allari Naresh Next in Crime Thriller Movie,Actor Allari Naresh New Movie News,Allari Naresh Upcoming Films in 2019,Allari Naresh Next Movie Details,Allari Naresh Green Signal For Crime Thriller
Allari Naresh Gives Green Signal For A Crime Comedy Movie

అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆ సినిమాతో మంచి సక్సెస్ సాధించి..అదే సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయిన నటుడు అల్లరి నరేష్. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు.. కమర్షియల్ మూవీస్ సైడ్ వెళ్లకుండా.. తనకు పర్ఫెక్ట్ గా సూటయ్యే కామెడీనే ఎంచుకొని ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించాడు. ఇక రొటీన్ సినిమాలను ఇష్టపడని ప్రేక్షకులకు నరేష్ సినిమాలు కూడా బోర్ కొట్టాయి. అందుకే గత కొద్ది కాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు హీరోగానే కాదు మంచి క్యారెక్టర్లు వేయడానికి కూడా సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలోనే మహర్షి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. సోలో హీరోగా ఓ క్రైమ్ కామెడీ కథకు అల్లరి నరేష్ ఓకే చెప్పాడట. గతంలో నరేష్ తో నేను, బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు లాంటి విజయవంతమైన సినిమాలు తీసిన చిట్టిబాబు దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. లక్ష్య ప్రొడక్షన్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారట. మే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

[subscribe]

[youtube_video videoid=-x70lm_uIx4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =