నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ – అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్

Actress Anketa Maharana Opens Up About Her Career,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Actress Anketa Maharana About 4 Letters Movie,Anketa Maharana About Her Career,Actress Anketa Maharana Latest Movie News,Heroine Anketa Maharana Reveals About Her Career
Actress Anketa Maharana Opens Up About Her Career

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో.. ఈశ్వర్‌, తుయా చక్రబోర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకొని ఈ నెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ మిస్ బెంగుళూర్ అంకిత మహారాణా తన రోల్ గురించి పలు ఆసక్తికరవిషయాలు తెలిపింది. ఈ సినిమాలో బోల్డ్ గా జోవియల్ గా ఉండే ఓ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ నని తెలిపింది. అంతేకాదు ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్ కి నా డైలాగ్స్ రిలేట్ అవుతాయి.. ఈ క్యారెక్టర్ ఇచ్చినందకు డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పుకొచ్చింది ఈ భామ. అంతేకాదు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో గ్లామరస్ రోల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది..ఈ సినిమా, ఈ సినిమాలోని నా పెర్ఫామెన్స్ నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని నాకు నమ్మకం ఉందన్నది. అల్లు అర్జున్ కు తాను అభిమానినని.. బాగా డ్యాన్స్ చేస్తాడని చెప్పింది ఈ బ్యూటీ. మరి ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ గురించి తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా ఇంకా ఈ సినిమాలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ తదితరులు నటిస్తున్నారు. ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ సినిమాను దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

[subscribe]

[youtube_video videoid=6rWIIjQZRM4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.