అందాల తార రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. `ఇమైక్క నోడిగళ్` (తెలుగులో `అంజలి సి.బి.ఐ`గా రిలీజ్ కానుంది), `అడంగ మారు` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ఉత్తరాది సోయగం… `అయోగ్య`, `సైతాన్ కా బచ్ఛా` సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే… విజయ్ సేతుపతి కాంబినేషన్‌లోనూ ఓ తమిళ సినిమాకి సంతకం చేసిందని కోలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే… పోలీస్ స్టోరీగా తెరకెక్కిన `టెంపర్`కి రీమేక్‌గా `అయోగ్య` రూపొందగా… మరో కాప్ స్టోరీ రీమేక్‌కి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తమిళంలో ఘనవిజయం సాధించిన `రాచ్చసన్` సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ రూపొందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `రాచ్చసన్` చిత్రంలో కథానాయకుడిది పోలీస్ పాత్ర కాగా… కథానాయికది టీచర్ పాత్ర. ఆ క్యారెక్టర్‌కి రాశి దాదాపుగా కన్‌ఫర్మ్ అయ్యిందని టాక్. త్వరలోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే… విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న చిత్రంలోనూ రాశి ఓ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
[youtube_video videoid=08Fg-1DCHVs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: