
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 105


ఆరు నెలల గ్యాప్‌లో వస్తున్న సూర్య

అనుష్క థ్రిల్లర్ సినిమా - అవన్నీ రూమర్సే

`బొమ్మరిల్లు` దర్శకుడితో అఖిల్?

వరుణ్ తేజ్ సినిమాలో తమిళ హీరో?

100 కోట్ల క్లబ్ లో "మణికర్ణిక"

`సైరా`లో తమన్నా పాత్ర డిటైల్స్

యాక్షన్ హీరోకు స్వల్ప గాయాలు

గుండెపోటుతో డీఎస్ దీక్షితులు కన్నుమూత

గల్లీ బాయ్ రీమేక్ లో మెగా హీరో?

వెంకటేష్ `సంక్రాంతి`కి 14 ఏళ్ళు

నాని 24 సినిమా షురూ

ఏయన్నార్ `బంగారు కుటుంబం`కి పాతికేళ్లు

విక్టరీ వెంకటేష్ `మల్లీశ్వరి`కి 15 వసంతాలు

మరో ఆసక్తికరమైన చిత్రంలో కళ్యాణి?
`హలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిజి గారాల పట్టి అయిన కళ్యాణి... తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా కాగా... మరొకటి సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న `చిత్రలహరి`. వీటితో పాటు మలయాళంలో తన తండ్రి ప్రియదర్శన్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ `మరక్కర్`లోనూ... దుల్కర్ సల్మాన్ నటిస్తున్న `వాన్` అనే తమిళ…

ఆరు నెలల గ్యాప్‌లో వస్తున్న సూర్య
తమిళ అనువాద చిత్రం `గజిని`తో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఆ తరువాత `యముడు` సిరీస్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇదిలా ఉంటే... ప్రస్తుతం సూర్య రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` కాగా... మరొకటి `కాప్పాన్`. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. అంతేకాదు... కేవలం ఆరు నెలల గ్యాప్‌లో ఈ చిత్రాలు తెరపైకి రానున్నాయి.

అనుష్క థ్రిల్లర్ సినిమా - అవన్నీ రూమర్సే
కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి అనుష్క ఎప్పుడూ ముందే ఉంటుంది. అరుంధతి సినిమాతో తనలో ఉన్న మరో యాంగిల్ చూపించిన ఈ జేజమ్మ.. ఆ తరువాత భగ భగ భాగమతి అంటూ మరోసారి తన పాత్రతో మెప్పించింది. ఇక భాగమతి సినిమా తరువాత స్వల్ప విరామం తీసుకున్న అనుష్క మరోసారి థ్రిల్లర్ మూవీతో భయపెట్టడానికి ముందుకొస్తుంది.

`బొమ్మరిల్లు` దర్శకుడితో అఖిల్?
ఊహ తెలియని వయసులోనే `సిసింద్రీ`గా నటించి అలరించాడు అక్కినేని అఖిల్. ఆ తరువాత... అక్కినేని కుటుంబ కథానాయకులంతా కలసి నటించిన `మనం`లో అతిథి పాత్రలో అదరగొట్టాడు. స్వల్ప విరామం తీసుకుని `అఖిల్`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారి మూడో తరం కథానాయకుడు... తదనంతరం `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలతో సందడి చేశాడు. అయితే... కథానాయకుడిగా నటించిన ఈ మూడు సినిమాల్లోనూ అఖిల్ నటనకి మంచి మార్కులు దక్కినా... ఆశించిన విజయాలైతే దక్కలేదు. ఈ నేపథ్యంలో... తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్.

వరుణ్ తేజ్ సినిమాలో తమిళ హీరో?
తమిళంలో ఘనవిజయం సాధించిన `జిగర్తండా` సినిమాని... `వాల్మీకి` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఒరిజినల్ వెర్షన్‌లో సిద్ధార్థ్ పోషించిన కథానాయకుడి పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఆ మధ్య... నాగశౌర్య, శ్రీ విష్ణు వంటి పేర్లు వినిపించినా... అవి వార్తలకే పరిమితమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం... ఆ పాత్రని తమిళ…

నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం
కమెడియన్, హీరో, యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తున్న అలీ బాలనటుడిగా 1979 సంవత్సరంలో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ సీతాకోక చిలుక మూవీ లో నటించిన అలీ బెస్ట్ చైల్డ్ అవార్డ్ అందుకున్నారు. యమలీల మూవీ తో హీరోగా మారారు. సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ తోపాటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.

కళా తపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్ 'విశ్వదర్శనం' టీజర్ రిలీజ్
కేవలం కమర్షియల్ సినిమాలే రాజ్యమేలుతున్న వేళ ఆ ఒరవడిని పక్కన పెట్టి కేవలం సంగీతం.. సాహిత్యం.. నృత్యం అనే మూడు అంశాలను కీలకం చేసుకొని సినిమాలు తీసి వహ్ వా అనిపించుకున్న దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజండరీ డైరెక్టర్ బయోపిక్ ను ఈ తెరకెక్కిస్తున్నారు.

100 కోట్ల క్లబ్ లో "మణికర్ణిక"
వీర నారి రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా 1857 సంవత్సరం బ్రిటిష్ ఈస్టిండియా పై పోరాటం నేపథ్యం లో మణికర్ణిక మూవీ రూపొందింది. దర్శకుడు క్రిష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంయుక్త దర్శకత్వం లో రూపొందిన మణికర్ణిక మూవీ లో కంగనా రనౌత్ రాణి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా నటించారు. ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు.

`సైరా`లో తమన్నా పాత్ర డిటైల్స్
దాదాపు పద్నాలుగేళ్ళుగా కథానాయికగా రాణిస్తోంది అందాల తార తమన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసిన ఈ మిల్కీ బ్యూటీ... జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. కాగా... సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ... మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి`లో ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది.

యాక్షన్ హీరోకు స్వల్ప గాయాలు
యాక్షన్ హీరో గోపీచంద్ షూటింగ్ లో గాయాలపాలయ్యారు. AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతుంది. రాజస్థాన్ రాష్ట్రం లోని జైపూర్ లో మూవీ లోని బైక్ ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

గుండెపోటుతో డీఎస్ దీక్షితులు కన్నుమూత
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు (దీవి శ్రీనివాస దీక్షితులు) కన్నుమూశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. మార్గమద్యంలోనే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన మురారి చిత్రంలో పూజారిగా నటించిన ఈయనకు ఆ సినిమాలో మంచి పేరొచ్చింది. ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం తదితర విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు.

గల్లీ బాయ్ రీమేక్ లో మెగా హీరో?
ఒక భాషలో సినిమా అలా హిట్టయితే చాలా మరో భాషలో రీమేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎనర్జిటిక్ యంగ్ అండ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇటీవల గల్లీ బాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి కలెక్షన్లు కురిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మొదటిసారి నోరువిప్పిన జక్కన్న
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇక తారక్ కూడా హాలీడే ట్రిప్ నుండి వచ్చేశాడు కాబట్టి కాబట్టి తాను కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడుకు ఐదవ వర్ధంతి శ్రద్ధాంజలి
ఆయనకంటే ముందు తెలుగు చలనచిత్రరంగంలో అద్భుత విజయాలు సాధించిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ ఆయన రాక తరువాతనే నిర్మాత అనే పదానికి ఒక "గ్లామర్" ఏర్పడింది.

వెంకటేష్ `సంక్రాంతి`కి 14 ఏళ్ళు
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. కెరీర్‌లో సింహభాగం ఈ తరహా చిత్రాలతోనే అలరించి... పలు ఘనవిజయాలను అందుకున్నారాయన. వాటిలో... 2005లో విడుదలైన `సంక్రాంతి` ఒకటి. తమిళ చిత్రం `ఆనందం` (2001)కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా స్నేహ, ఆర్తి అగర్వాల్ నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సంగీత, శివబాలాజీ, రతి, శర్వానంద్, చంద్రమోహన్, శారద తదితరులు నటించారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించగా... ఎస్.ఎ.రాజ్ కుమార్ స్వరాలు…

ఆసక్తిని రేకెత్తిస్తున్న IIT కృష్ణమూర్తి - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ వర్ధన్ దర్శకత్వంలో IIT కృష్ణమూర్తి అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పృథ్వి దండమూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజైంది. ఓ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. టీజర్ డేట్ ను కూడా ఆ పోస్టర్ లోనే ప్రకటించేసింది. ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

నాని 24 సినిమా షురూ
ప్రస్తుతం నాని.. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఇప్పుడు ఇంకో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు నాని. గత కొద్దికాలంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఓ పోస్టర్ ద్వారా.

ఏయన్నార్ `బంగారు కుటుంబం`కి పాతికేళ్లు
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ అంటేనే... పలు క్లాసిక్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం `బంగారు కుటుంబం`. మధ్యతరగతి కుటుంబ మనస్తత్వాలు, కుటుంబ బంధాలు, మానవ విలువలు... వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ మూవీగా నిలచింది. అంతేకాదు... 1994కి గానూ `ఉత్తమ చిత్రం`గా `నంది` పురస్కారాన్ని అందుకుంది. అలాగే... `ఉత్తమ నటుడు`గా ఏయన్నార్‌కి `నంది` పురస్కారాన్ని అందించింది.

అక్కినేని వారి వరుడు- కొల్లిపర వారి వధువు- ఏడుపదుల నాటి ఏడడుగుల బంధం
జనానికి సినిమాలు అంటే ఎంత ఇష్టమో... సినిమా వాళ్లు అంటే ఎంత మోజో చెప్పలేము.. కానీ సినిమా వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా, పెళ్లికి పిల్లని ఇవ్వాలన్నా అంతే బెరుకు. 1950కి ముందు తరంలో ఎక్కువ శాతం సినిమా వాళ్ళు సినిమా వాళ్లనే చేసుకునేవారు. ఇండస్ట్రీలోని మగవాళ్లకు బయటి సంబంధాలు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఇక సినిమా ఇండస్ట్రీలోని ఆడవాళ్ళ సంగతి సరే సరి.

విక్టరీ వెంకటేష్ `మల్లీశ్వరి`కి 15 వసంతాలు
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో పలు ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్స్ చేశారు. తాజాగా `ఎఫ్ 2`లోనూ తన మార్క్ కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే ఆ చిత్ర ఘనవిజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక... హాస్యభరిత పాత్రల పరంగా వెంకీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచే పాత్రల్లో... `మల్లీశ్వరి` చిత్రంలోని `పెళ్ళి కాని ప్రసాద్` క్యారెక్టర్ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. ముదురు వయసు బ్రహ్మచారిగా వెంకీ నటన ఆ సినిమాకే ప్రధాన బలంగా నిలచింది. దానికి తోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కె.విజయ భాస్కర్ బ్రాండ్... ఈ…