సుప్రియతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్!

Adivi Sesh Gives Clarity About His Marriage With Supriya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema Updates,Adivi Sesh Gives Clarity About His Marriage,Hero Adivi Sesh Latest Updates,Adivi Sesh Get Married With Supriya,Actor Adivi Sesh Marriage News
Adivi Sesh Gives Clarity About His Marriage With Supriya

కర్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పంజా సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఆ తరువాత బాహుబలి, క్షణం, గూఢచారి వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇక ఇన్నేళ్ల అడివి శేష్ కెరీర్ లో తనపై రూమర్లు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ ఇటీవల ఓ గాసిప్ మాత్రం తెగ ప్రచారం అయ్యింది. అదేంటంటే.. అక్కినేని నాగార్జున మేన కోడలు సుప్రియని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు చాలా తక్కువ టైంలోనే ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఈ నేపధ్యంలో ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో ఆయనను ప్రశ్నించగా… అడివి శేష్ మాట్లాడుతూ… ”ఇదొక ఆధారం లేని గాసిప్ గా కొట్టిపారేసారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. ఎవరో వెబ్ లో కావాలని క్రియేట్ చేసి రాశారు… కాకపోతే దురదృష్టవశాత్తు బాగా స్ప్రెడ్ అయ్యింది” అన్నారు.

ఇక ఇటీవల తన ట్విట్టర్ లో త్వరలోనే ఓ బిగ్ ఎనౌన్స్ మెంట్ ఉండబోతోందని చేసిన ట్వీట్ పై కూడా ప్రశ్నించగా… తను అతి త్వరలోనే ఆ ప్రకటన దేని గురించి అనేది రివీల్ చేస్తానని, ప్రస్తుతానికి తను దాని గురించి మాట్లాడకూడదని అన్నారు. మరి అదేంటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా ప్ర‌స్తుతం 2 స్టేట్స్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు అడివి శేష్.

[subscribe]

[youtube_video videoid=CQ_7dQbA-HY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.