దాదాపు మూడేళ్ళ క్రితం వచ్చిన `జెంటిల్ మన్`లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన నాని… అతి త్వరలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపించనున్నాడట. తనని కథానాయకుడిగా పరిచయం చేసిన దర్శకుడి కాంబినేషన్‌లో ఈ పాత్ర చేయనున్నాడట ఈ నేచురల్ స్టార్. కాస్త వివరాల్లోకి వెళితే… ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన `అష్టా చమ్మా`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని… అనతికాలంలోనే కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక దశలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినా… `భలే భలే మగాడివోయ్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చి… వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ… ముందుకు సాగుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు సిద్ధమవుతున్న `జెర్సీ`లో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్‌గా కనిపించనున్న నేచురల్ స్టార్… తాజాగా పట్టాలెక్కిన విక్రమ్ కె.కుమార్ చిత్రంలో క్రైమ్ స్టోరీ రైటర్‌గా కనిపించనున్నాడట. ఇది నాని నటిస్తున్న 24వ సినిమా కాగా… 25వ చిత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుందని టాక్. `అష్టాచమ్మా`, `జెంటిల్ మన్` తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రంలోనే నాని విలన్‌గా నటించనున్నాడని తెలిసింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు నటించనుండగా… ప్రతినాయకుడిగా నాని దర్శనమివ్వనున్నాడట. విక్రమ్ కుమార్ సినిమాతో పాటు సమాంతరంగా ఈ చిత్రాన్ని చేయాలని నాని ప్లాన్ చేసుకున్నాడని… ఈ ఏడాది చివరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కానుందని సమాచారం. డిఫరెంట్ రోల్స్‌తో ముందుకు సాగుతున్న నాని… ఆ యా చిత్రాలతో మంచి విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!
[youtube_video videoid=bjl-gISLXzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: