ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాను పూర్తి చేసిన శర్వానంద్, ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ లో గత గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరణ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాట కోసం దాదాపు 250 మందిని తీసుకున్నారట. 250 మందితో చాలా ప్రత్యేకంగా పాటను చిత్రీకరించనున్నట్టు సమాచారం. షూటింగ్ లో మేజర్ పార్ట్ స్పెయిన్ లోనే పూర్తి చేయనున్నారట.
కాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణీ ప్రియదర్శన్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో శర్వా మాఫియా డాన్ పాత్రలో, కాజల్ అగర్వాల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కాజల్ పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే బెల్లంకొండతోనే రెండు సినిమాల్లో నటిస్తుంది కాజల్. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో చేస్తోన్న సినిమా షూటింగ్ అయిపోగా.. ఇప్పుడు తేజ సినిమాతో బిజీగా ఉంది. క్వీన్ తమిళ్ రీమేక్ లో కూడా కాజల్ నటిస్తోంది.
[youtube_video videoid=tVbRdk4bX2E]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: