ప్రస్తుతం రానా పలు ప్రాజెక్టులతో చాలాా బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. హాతీ మేరీ సాతీ సినిమాతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప మరియు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూరల్ తెలంగాణ నేపథ్యంలో మరో సినిమా రానా లిస్ట్ లో ఉన్నాయి. ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన డైరీలో మరో సినిమాకు స్పేస్ ఇచ్చాడు రానా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సిద్దార్ధ్ నటించిన గృహం సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న మిలింద్ డైరెక్షన్ లో మరో కొత్త సినిమాకు రానా ఓకే చెప్పాడు. విశ్వమిత్ర శాంతి పిక్చర్చ్ బ్యానర్ పై గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్క్రీప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఆగష్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ కి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
మొత్తానికి గత ఏడాది ఒక్క సినిమాతో కూడా పలకరించని రానా.. ఈ ఏడాది ఒక సినిమా తరువాత ఒకటి చేస్తూ ఖాళీ లేకుండా బిజీ బిజీ గా గడుపుతున్నాడు. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.
[youtube_video videoid=PDDz9ftIPA0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: