గత ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించాయి. కొన్ని సినిమాలు భారీ హిట్టందుకోగా.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ ఏడాది కూడా పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజయి సందడి చేశాయి. ఎన్టీఆర్ మహానాయకుడు, పేట, వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలు రిలీజవ్వగా వాటిలో ఎఫ్ 2 మాత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిజానికి ఇది మంచి ఆరంభం కాదనే చెప్పొచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈనెల కాస్త సినిమాల హడావుడి తగ్గింది. ఒకటో, రెండో సినిమాలే ప్రేక్షకులను పలకరించాయి. వాటిలో కూడా యాత్ర సినిమానే కాస్త మంచి టాక్ సంపాదించుకోగలిగింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో, మమ్ముట్టి ప్రధాన పాత్రలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందింది. ఇక ఫిబ్రవరి 22న మహానాయకుడు, మిఠాయి సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక ఆతరువాత ఈనెల చివరిలో కూడా పెద్దగా రిలీజ్ లు ఏం లేవు.
అయితే మార్చి నెల మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉండేలా కనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలే రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మార్చి 1న 118, మార్చి 15న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మార్చి 21న ఏబీసీడీ, విశ్వామిత్ర, సెవెన్ (7), మార్చి 29న సూర్య కాంతం, మార్చి 29న అర్జున్ సురవరం, ఇదే మార్చిలో లక్ష్మీస్ ఎన్టీఆర్, ప్రేమ కథా చిత్రమ్ 2, నాగకన్య, సువర్ణ సుందరి, కథనం, ఐరా ఇలా వరుసపెట్టి సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.
ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా రిలీజ్ కు సిద్దంగా ఉన్నా.. ఈ సినిమాలన్నింటికి అంత హైప్ లేదని చెప్పొచ్చు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా ప్రారంభం నుండి రిలీజయ్యేంత వరకూ భీభత్సమైన ప్రమోషన్లు చేస్తుంటారు. కానీ పైన చెప్పిన లిస్ట్ లో ఉన్న ఓ ఒక్క సినిమాను కూడా అంతలా హైప్ చేసినట్టు కనిపించట్లేదు. మరి ముందే అనవసరంగా అంత హైప్ క్రియేట్ చేయడం ఎందకని అనుకుంటున్నారో ఏమో? తెలియదు కానీ చాలా తక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అది కూడా మంచిదేలే.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే…అసలు ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి సైలెంట్ గా హిట్ట కొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. మరి ఈ మార్చిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొడుతుందో చూద్దాం…
[youtube_video videoid=w8F7Dm-Lv6s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: