బాహుబలి మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి మోస్ట్ వాంటెడ్ హీరో గా మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న రానా దగ్గుబాటి మూడు కొత్త సినిమాలు ప్రారంభానికి సిద్ధం గా ఉన్నాయి. ప్రస్తుతం రానా నటిస్తున్న 1945 (తెలుగు, తమిళ్ ), హాథీ మేరే సాథీ (హిందీ ) సినిమాల షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం లో రానా హీరో గా భారీ బడ్జెట్ మూవీ హిరణ్య కశప త్వరలోనే ప్రారంభం కానుంది. హిట్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల చాలా రోజులుగా పక్కా స్క్రిప్ట్ తో వెయిటింగ్ లో ఉన్నారు. హిట్ మూవీ గృహం దర్శకుడు రూపొందించే మూవీ లో నటించడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూడు ప్రాజెక్ట్స్ రానా ఇచ్చే కాల్ షీట్స్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటాయి. ఒక హాలీవుడ్ మూవీకి , అనుష్క హీరోయిన్ గా రూపొందే మూవీ కి రానా ను సంప్రదించినట్టు సమాచారం. 2019 సంవత్సరం లో రానా షూటింగ్ తో బిజీగా ఉంటారు.
[youtube_video videoid=lrZDE47_lNQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: