పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక ఆ తరువాత పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు కు కూడా ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు రేణు మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపింది. రీసెంట్ గా ఒక సినిమాకు సైన్ చేశానని.. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం గా ఉందని… నేను చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నాను అని రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చెప్పింది.‘‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ డైరెక్షన్ లో సామాజికవేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో నేను నటించబోతున్నాను.. సిల్వర్ స్క్రీన్ పై ఆమె పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నా.. అంతే కాదు మరో ముఖ్యమైన ప్రాజెక్టుకు కూడా సంతకం చేశా.. వచ్చే వారం ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నా’ అని రేణు పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా హేమలత లవణం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.
[youtube_video videoid=D0CrCkPdk5A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: