కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News

ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 15

Film Censor Board Announce One Good News To Film Producers
సినిమా వార్తలు

"గుడ్ న్యూస్ "

ఏ మూవీ కైనా సెన్సార్ సర్టిఫికెట్ తప్పని సరి. కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ తో చిత్ర పరిశ్రమ కుంటుపడింది. భారీ నష్టాల పాలయింది. లాక్ డౌన్ తో సినిమా రిలీజ్ లు, షూటింగ్స్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నిలిచిపోయాయి. సెన్సార్ కాని సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు శుభవార్త. ఇప్పుడు సినిమాలు ఆన్ లైన్ లో సెన్సార్ చేసుకొనడానికి జాతీయ సెన్సార్ బోర్డ్ అనుమతి ఇచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రానా ట్వీట్ కు సురేష్ ప్రొడక్షన్స్ ఫన్నీ రిప్లై..!

ఎలాంటి హడావుడి లేకుండా రానా తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి ఒక రేంజ్ లో షాక్ ఇచ్చాడు రానా. నిజానికి వేరే ఏదైనా హీరో అయితే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో. మొదటినుండి పెళ్లి, ప్రేమ అనే విషయాలు ఇంట్రెస్ట్ లేనట్టు ఉండే రానా ఇప్పుడు ఇలా చేయడంతో ఇంత రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగాయి. ఇక కొంత మంది టాలీవుడ్ హీరోలు కూడా చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతూ ట్వీట్స్ చేశారు. ఇక రానా పెళ్లిపై వచ్చిన ఫన్నీ మీమ్స్ అయితే పీక్స్ లెవెల్. అందరు సంగతి ఏమోకానీ ముందు ప్రభాస్ కు మాత్రం భజన స్టార్ట్ అయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవును ప్రభాస్ 20 లో ఉన్నాను..!

'బాహుబలి' సిరీస్, 'సాహో' తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమా... పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ప్రభాస్ తలుపు తడుతున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ కి ఆ రేంజ్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు దర్శక నిర్మాతలు కూడా. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా... కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ తీసేసినా విదేశాలు వెళ్లడం కష్టమే కాబట్టి ఇక్కడే షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

"పుష్ప" మూవీ లో ఫోక్ సాంగ్స్ ?

బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా "పుష్ప" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రం ‘నాని’కి 16 ఏళ్ళు

ఈతరం కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరే వేరు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలకూ పెద్దపీట వేస్తుంటాడీ టాలెంటెడ్ స్టార్. అలా.. మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాల్లో ‘నాని’ ఒకటి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్..!

క‌రోనా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వాలు తమ వంతు సాయం అందిస్తుండగా సినీ తారలు కూడా ముందుకొచ్చి పెద్దఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు రూ.1.30 కోట్లను విరాళంగా ప్రక‌టించిన సంగతి కూడా విదితమే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల స‌హాయ నిధులకు కూడా చెరో రూ.5 ల‌క్షలు చొప్పున అందజేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘లయన్’గా బాలకృష్ణ సందడికి 5 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణ త‌న కెరీర్‌లో పలువురు నూతన దర్శకులను ప్రోత్సహించారు. వారిలో సత్యదేవ్‌ ఒకరు. బాలయ్య, సత్యదేవ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఆ చిత్రమే ‘లయన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా త్రిష, రాధికా ఆప్టే నటించారు. ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత రాధికా ఆప్టే మరోసారి బాలయ్యతో జట్టుకట్టగా.. త్రిష తన కెరీర్‌లో తొలిసారి బాలయ్య సరసన క‌నువిందు చేసింది. ప్రకాష్‌రాజ్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సురేష్, ఇంద్ర‌జ‌, జయసుధ, గీత, చలపతిరావు, ప్రదీప్ రావత్, విజయకుమార్, అలీ, శివ‌బాలాజి, అర్చ‌న‌ ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శర్వానంద్ ‘అందరి బంధువయ’కి 10 ఏళ్ళు

కుటుంబ బంధాలకు, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు చంద్రసిద్ధార్థ తీరే వేరు. చంద్రసిద్ధార్థ రూపొందించిన ఈ త‌ర‌హా చిత్రాల్లో ‘అందరి బంధువయ’ ఒకటి. శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్, విజయ్‌సాయి, వి.రామకృష్ణ, హరితేజ, యం.యస్.నారాయణ, ప్రగతి, కృష్ణభగవాన్, జీవా ముఖ్య భూమికలు పోషించారు. ఫిల్మోత్సవ్ స్టూడియోస్ (ప్రై) లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి బ‌ల‌భ‌ద్ర‌పాత్రుని ర‌మ‌ణి క‌థ‌, మాట‌లు అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సుధీర్‌బాబు.. ఇంట్రెస్టింగ్ లైనప్

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుల్లో సుధీర్ బాబు ఒకరు. ‘ప్రేమకథా చిత్రమ్’(2013), ‘సమ్మోహనం’(2018) వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సుధీర్.. త్వరలో విడుదల కానున్న ‘వి’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం రిలీజ్ డేట్‌పై క్లారిటీ వస్తుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఒకే ఒక్క సీన్ మినహా ‘క్రాక్’ పూర్తి

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013).. ఇలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు చిత్రాలు విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత రవితేజ, గోపీచంద్ కలయికలో మూడో సినిమా వస్తోంది. ఆ చిత్ర‌మే.. ‘క్రాక్’. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు రవితేజ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి 'త్రిష' కు చిరు ఛాన్స్..!

ఆచార్య కొరటాల శివ-చిరు కాంబినేషన్ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే మొదట ఈ సినిమా కోసం త్రిష ను తీసుకోగా.. కొన్ని కారణాల తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే త్రిష స్థానంలో కాజల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. త్రిష తప్పుకోవడంపై పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోవడంతో తప్పుకుందని చిరు క్లారిటీ కూడా ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిరాడంబరంగా జరిగిన హీరో నిఖిల్ వివాహం..!

మొత్తానికి రెండుసార్లు వాయిదా పడిన అనంతరం టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వివాహం జరిగింది. నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ ల వివాహం ఈ రోజు నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ ఉదయం 6.31 గంటలకు వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు...కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే ఈ పెళ్లి హాజరయ్యారు. కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా పెళ్లి - సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రానా - ప్రభాస్ పై ఫన్నీ మీమ్స్

ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్న సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను చూస్తే అదే గుర్తొస్తుంది. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా..రానా పెళ్లి విషయమే. నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను బయటి ప్రపంచానికి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అందరూ ఏమో కానీ టాలీవుడ్ లో కొందరు హీరోలు మాత్రం రానా పై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు. సాయి తేజ్ ఇందంతా కలా.. మళ్ళీ పడుకుందాం అని ట్వీట్ చేయగా.. నాని అయితే 2020 లో ఇంకా ఏమేం చూస్తామో అని ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస-రానా పై అయితే ఒక రేంజ్ లో ట్వీట్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ రోజు ఈ మీమ్స్ మీదనే రచ్చ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మహానటి' సీరియస్.. నేను బరువు తగ్గింది దానికి మాత్రమే..!

'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. న‌రేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో 'మిస్ ఇండియా'.. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో 'పెంగ్విన్' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో 'మైదాన్' సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' లో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
#PRABHAS20 అప్ డేట్ రిలీజ్
సినిమా వార్తలు

#PRABHAS20 అప్ డేట్ రిలీజ్

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేపు రానున్న # PRABHAS 20 అప్ డేట్

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.

TFN Adminవాట్సాప్
2 Hours Love Movie Public Talk, 2 Hours Love Movie Review, 2 Hours Love Movie Story, 2 Hours Love Review, 2 Hours Love Review And Rating, 2 Hours Love Review Live Updates, 2 Hours Love Telugu Movie Plus Points, 2 Hours Love Telugu Movie Review, 2019
రివ్యూ

2 అవ‌ర్స్ ల‌వ్‌ తెలుగు మూవీ రివ్యూ

క‌థ‌కు సంబంధం లేని రెండు, మూడు స‌న్నివేశాలు, సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా అనిపించ‌డం మిన‌హా సినిమా బాగానే తెరకెక్కించాడు. సెకండాఫ్‌లో కథలో వేగాన్ని పెంచి ఉంటే సినిమా మరింత బావుండేది శ్రీ పవార్. కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ల‌ను చూడాల‌నుకునే వారికి త‌ప్ప‌కుండా న‌చ్చే సినిమా.

TFN Adminవాట్సాప్
Saaho Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Latest Telugu Movies Review And Rating,2019 Telugu Movies Reviews,Saaho Review,Saaho Movie Review,Saaho Movie Public Talk,Saaho Telugu Movie
రివ్యూ

సాహో తెలుగు మూవీ రివ్యూ

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎంజాయ్ చేస్తారు.

TFN Adminవాట్సాప్
Saaho Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Telugu Movies News 2019,Latest Telugu Movies Review And Rating,2019 Telugu Movies Reviews,Saaho Review,Saaho Movie Review,Saaho Movie Public Talk,Saaho Telugu Movie
సినిమా వార్తలు

సాహో మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

షార్ట్ ఫిలిమ్స్ లేకుంటే నేను లేను

ప్రస్తుతం ఎక్కడ చూసినా సాహో మాట తప్పా ఇంకేం వినిపించట్లేదు. ఇంకా కొద్ది గంటల్లో సినీ లవర్స్ ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ కూడా ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక చిత్ర యూనిట్ కూడా రోజుకో అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్