బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా “పుష్ప” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న “పుష్ప” మూవీ లో ఫోక్ సాంగ్స్ శాతం ఎక్కువగా ఉంటుందని , అడవి పరిసర ప్రాంత గిరిజన గూడెం ప్రజలతో కథ సాగుతుందని, అందువల్ల జానపద గీతాలు ఎక్కువగా ఉండేటట్టు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బెస్ట్ డ్యాన్సర్ గా పేరుపొందిన అల్లు అర్జున్ క్రేజ్, డ్యాన్స్ లను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్టు సమాచారం. “పుష్ప” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























