“గుడ్ న్యూస్ “

Film Censor Board Announce One Good News To Film Producers

ఏ మూవీ కైనా సెన్సార్ సర్టిఫికెట్ తప్పని సరి. కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ తో చిత్ర పరిశ్రమ కుంటుపడింది. భారీ నష్టాల పాలయింది. లాక్ డౌన్ తో సినిమా రిలీజ్ లు, షూటింగ్స్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నిలిచిపోయాయి. సెన్సార్ కాని సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు శుభవార్త. ఇప్పుడు సినిమాలు ఆన్ లైన్ లో సెన్సార్ చేసుకొనడానికి జాతీయ సెన్సార్ బోర్డ్ అనుమతి ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సార్ సర్టిఫికెట్ ఉంటేనే థియేటర్స్ లో కానీ OTT లో కానీ సినిమాలు రిలీజ్ చేయవచ్చు. కరోనా కారణం గా థియేటర్స్ ఓపెన్ అవడానికి టైమ్ పట్టే అవకాశం ఉంది. కొంతమంది నిర్మాతలు తమ మూవీస్ ను OTT లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్ లైన్ లో సెన్సార్ అనగానే చిత్ర పరిశ్రమ రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. ఇది వరకు మూవీ సెన్సార్ కార్యక్రమానికి సెన్సార్ బోర్డ్ ముందు నిర్మాత హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు సినిమా ఎక్కడ ప్రదర్శించినా సెన్సార్ బోర్డ్ సభ్యులు పాల్గొని ఈ మెయిల్ ద్వారా సెన్సార్ సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. హార్డ్ డిస్క్, క్యూబ్ రూపంలో సినిమాను పంపినా సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేస్తుంది. ఈ విధంగానే హైదరాబాద్ లో మూవీస్ సెన్సార్ చేయనున్నట్టు సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ అధికారి వి. బాలకృష్ణ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 9 =