శర్వానంద్ ‘అందరి బంధువయ’కి 10 ఏళ్ళు

Sharwanand Wholesome Family Entertainer Andari Bandhuvaya Completes 10 Years.

కుటుంబ బంధాలకు, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు చంద్రసిద్ధార్థ తీరే వేరు. చంద్రసిద్ధార్థ రూపొందించిన ఈ త‌ర‌హా చిత్రాల్లో ‘అందరి బంధువయ’ ఒకటి. శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్, విజయ్‌సాయి, వి.రామకృష్ణ, హరితేజ, యం.యస్.నారాయణ, ప్రగతి, కృష్ణభగవాన్, జీవా ముఖ్య భూమికలు పోషించారు. ఫిల్మోత్సవ్ స్టూడియోస్ (ప్రై) లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి బ‌ల‌భ‌ద్ర‌పాత్రుని ర‌మ‌ణి క‌థ‌, మాట‌లు అందించారు.

చైతన్యప్రసాద్ కలం నుంచి జాలువారిన పాటలకు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. “మళ్ళీ మళ్ళీ రమ్మని”, “రోజు రోజు నిన్నే”, “జిగిబిగి చిలక”, “సూర్యుడు ఎవరయ్యా”, “జామ చెట్టుకు జామకాయలు”, “నందామయ”.. ఇలా ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. ఉత్తమ కుటుంబకథా చిత్రం (అక్కినేని అవార్డ్) విభాగంలో ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకుందీ సినిమా. 2010 మే 14న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘అందరి బంధువయ’.. నేటితో 10 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here