ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 14

'RRR' రిలీజ్ అప్పుడే ఉండొచ్చు ..!
చిన్న సినిమాల ప్లానింగ్ లో విష్ణు మంచు
సంపత్ నంది డ్రీమ్ ప్రాజెక్ట్
శోభన్‌బాబు, విజయశాంతి ‘దేవాలయం’కు 35 ఏళ్ళు

అజిత్ ‘వలిమై’ ఆగమనం అప్పుడేనా?
సుజీత్ ను చిరు నమ్మడానికి కారణం అదేనట..!

బాలయ్యకు బాలీవుడ్ విలన్..!

తల్లి పాత్రలో హీరోయిన్ సిమ్రాన్ ?
పెళ్ళికి నో - సాయి పల్లవి

నాకు ఇష్టమైన ముగ్గురు హీరోలు వారే..!

సింపుల్ గా 'రంగస్థలం' మహేష్ వివాహం..!

వరుణ్ తేజ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్
లాక్ డౌన్ ఎఫెక్ట్
కరోనా మహమ్మారి కారణం గా ప్రపంచం తల్ల క్రిందులు అయ్యింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 3లక్షలమంది మరణించారు. కరోనా కారణం గా ప్రజలకు పలుఇబ్బందులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యి రకరకాల వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

'RRR' రిలీజ్ అప్పుడే ఉండొచ్చు ..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
'దసరా' రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడం. థియేటర్స్ మూత పడటం... ఇలా వెంటనే జరిగిపోయాయి. ఇక దీనివల్ల రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త ఆగిపోయింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ తీసేసిన తర్వాత దసరా పండుగకి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన చాలా సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి గట్టి పోటీ ఉంటుందేమో అని కూడా…
చిన్న సినిమాల ప్లానింగ్ లో విష్ణు మంచు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు "విష్ణు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢీ ", "దేనికైనా రెడీ ", "దూసుకెళ్తా " , "ఈడో రకం ఆడో రకం", "లక్కున్నోడు ", "ఆచారి అమెరికా యాత్ర " వంటి కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి , ఆ బ్యానర్ పై "దేనికైనా రెడీ" , "దూసుకెళ్తా" , "పాండవులు పాండవులు తుమ్మెద" , "కరెంట్ తీగ" , "సింగం 123" వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు.
సంపత్ నంది డ్రీమ్ ప్రాజెక్ట్
సూపర్ హిట్ "ఏమైంది ఈ వేళ " మూవీ తో సంపత్ నంది దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రైటర్, డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన "రచ్చ ","బెంగాల్ టైగర్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ "గౌతమ్ నంద" నిరాశ పరిచింది. సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్" మూవీ రూపొందిస్తున్నారు.

కుటుంబ కథా చిత్రం ‘పెళ్ళాం చెపితే వినాలి’కి 28 ఏళ్ళు
అగ్రశ్రేణి దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన పలు కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘పెళ్ళాం చెపితే వినాలి’ ఒకటి. హరీష్, మీనా జంటగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీకాంత్, కాస్ట్యూమ్ కృష్ణ, గిరిబాబు, శివాజీరాజా, వై.విజయ, సాగరిక, కోవై సరళ, రాజీవి, బాబుమోహన్ ముఖ్య పాత్రలు పోషించగా మురళీమోహన్ ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు.
శోభన్‌బాబు, విజయశాంతి ‘దేవాలయం’కు 35 ఏళ్ళు
విప్లవాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు టి.కృష్ణ తీరే వేరు. ఆయన రూపొందించిన ప్రతీ సినిమా ఈ కోవకు చెందినదే కావడం విశేషం. వాటిలో ‘దేవాలయం’ ఒకటి. నాస్తిక, ఆస్తిక వాదాల మధ్య వారధిగా నిలిచిన ఈ చిత్రంలో నటభూషణ్ శోభన్‌బాబు, విజయశాంతి నాయకానాయికలుగా నటించారు. రావుగోపాలరావు, సోమయాజులు, సుత్తి వేలు, పి.యల్.నారాయణ, నర్రా వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ, ‘అత్తిలి’ లక్ష్మి, శశికళ ముఖ్య భూమికలు పోషించారు.

చిరంజీవి, రాధిక సెన్సేషనల్ మూవీ ‘న్యాయం కావాలి’కి 39 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, అగ్రశ్రేణి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో దాదాపు 23 చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం ఘనవిజయాలు సాధించినవే కావడం విశేషం. అలాంటి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘న్యాయం కావాలి’. “ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయి.. మోసం చేసిన అబ్బాయిపై చేసిన న్యాయపోరాటంలో ఎటువంటి విజయాన్ని సాధించింది?” అనే కథాంశంతో ‘న్యాయం కావాలి’ రూపొందింది. నవలా రచయిత్రి డి.కామేశ్వరి రచించిన ‘కొత్తమలుపు’ నవలాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కోదండరామిరెడ్డి.

అజిత్ ‘వలిమై’ ఆగమనం అప్పుడేనా?
‘నేర్‌కొండ పార్‌వై’(బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) వంటి విజయవంతమైన చిత్రం తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వలిమై’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జోడిగా 'కాలా' ఫేమ్ హ్యూమా ఖురేషి నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా బాణీలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని 2020 దీపావళికి లేదంటే 2021 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కోలీవుడ్ సర్కిల్స్ కథనాల ప్రకారం.. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్…
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన కీర్తి సురేష్ 'పెంగ్విన్'..!
లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ ఏడాది చివరికి ఏమన్నా తెరుచుకోవచ్చేమో అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలను ఆన్లైన్ లో విడుదల చేసేసారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా, తమిళంలో జ్యోతిక లీడ్ రోల్ లో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా, హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్ కూడా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకూడా రిలీజ్ కు సిద్ధమైంది.
సుజీత్ ను చిరు నమ్మడానికి కారణం అదేనట..!
టాలీవుడ్ కో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు.. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో తనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు.. అయితే వారందరినీ పక్కన పెట్టి 'లూసిఫర్' భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు ఇవ్వడంపై అందరూ ఆశ్చర్య పోయారు. అయితే తనపై ఆ నమ్మకం ఉందని చిరు అప్పుడే చెప్పాడు. ఇక చిరుకు సుజీత్ పై అంత నమ్మకం కలగడానికి గల కారణం సాహో సినిమానేనట. దాదాపు 400 కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా ఇండియా.. ప్రభాస్, శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నటీ నటులే ఈ సినిమాలో నటించగా.. వారిని హ్యాండిల్ చేసిన విధానం ఇవి చిరు కు బాగా నచ్చాయట. దీనితో లూసిఫర్ భాద్యతలు కావాలని…

బాలయ్యకు బాలీవుడ్ విలన్..!
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.

తల్లి పాత్రలో హీరోయిన్ సిమ్రాన్ ?
1997 సంవత్సరం లో టాలీవుడ్, కోలీవుడ్ లలో ప్రవేశించిన సిమ్రాన్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సమర సింహా రెడ్డి", "కలిసుందాం రా ", "నువ్వు వస్తావని", నరసింహ నాయుడు ", సీతయ్య " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "జాన్ అప్పారావు 40ప్లస్ "(2008 ) మూవీ తరువాత తెలుగు మూవీస్ లో సిమ్రాన్ నటించ లేదు. తెలుగు, తమిళ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్ ప్రస్తుతం తమిళ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. సిమ్రాన్ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో తల్లి పాత్రలో నటించనున్నారని సమాచారం.
పెళ్ళికి నో - సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన సాయి పల్లవి , ఆ మూవీలో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు." MCA" , "పడి పడి లేచె మనసు " మూవీస్ లో నటించిన సాయి పల్లవి తమిళ, మలయాళ మూవీస్ లో కూడా నటించారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న "లవ్ స్టోరీ ", వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న "విరాటపర్వం 1992 " మూవీస్ లో నటిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో అదుర్స్ అట..!
ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూసేది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంట్రడక్షన్ వీడియో కోసం. రామ్ చరణ్ పుట్టిన రోజు చరణ్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనితో తమ హీరో వీడియో ఏ రేంజ్ లో ఉంటదా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో ఉండకపోవచ్చని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అది నిజం కాదని, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఇప్పటికే సిద్ధం అయ్యిందని టాక్. ఇప్పటికే ఈ వీడియోను సిద్ధం చేశారట. ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ తో పాటు యాక్షన్ మూమెంట్స్ అదుర్స్ అట. టీమ్ అంతా…

నాకు ఇష్టమైన ముగ్గురు హీరోలు వారే..!
'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. 'వర్షం' సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ హవా నడుస్తుండటంతో తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే తమిళ్, మలయాళంలో మాత్రం పలు సినిమాలతో బిజీగానే ఉంది.

సింపుల్ గా 'రంగస్థలం' మహేష్ వివాహం..!
లాక్ డౌన్ అయినా కూడా పెళ్లిళ్లు మాత్రం ఆగట్లేదు. టాలీవుడ్ సెలబ్రిటీస్ లాక్ డౌన్ ను సైతం లెక్కచేయకుండా యంగ్ హీరో నిఖిల్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. మొన్ననే దిల్ రాజు తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోగా.. ఈ రోజు యంగ్ హీరో నిఖిల్ వివాహం జరిగింది. హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ ఉదయం 6.31 నిమిషాలకు కుటుంబ సభ్యులు...కొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది.

నిహారిక, వరుణ్ పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!
మెగా ఫ్యామిలీలో నాగబాబు కూతురు నిహారిక పెళ్లి మ్యాటర్ ఎప్పుడు హాట్ టాపిక్కే. నిహారిక సినిమాల గురించి ఎప్పుడూ రూమర్లు రావు కానీ నిహారిక పెళ్లిపై మాత్రం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో ప్రభాస్ తో పెళ్లి అని.. సాయి తేజ్ తో అని ఇలా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఇక ఇటీవలే నిహారిక కూడా త్వరలోనే తన పెళ్లి ఉండబోతున్నట్టు హింట్ కూడా ఇచ్చింది. అసలే తక్కువ టైం ఉందని.. ఆ టైం లో మంచి సినిమాల్లో నటించాలని చెప్పింది.
కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా..వీర జవానుల కథలు నాకు పంపండి..!
సోషల్ మీడియాలో మంచు విష్ణు కాస్త యాక్టీవ్ గానే ఉంటాడు. తన సినిమాలకు సంబందించే కాదు అప్పుడప్పుడు సమాజంలోని విషయాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియచేస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా జన్మనిచ్చిన తల్లి, వీర జవానులు, రైతుల గొప్పతనం గురించి తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్
బ్లాక్ బస్టర్ "ఫిదా ", "తొలి ప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్ " మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT10 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది.